12th Fail: విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే ప్రధానపాత్రలో నటించిన తాజా సినిమా ‘12th ఫెయిల్’. చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను సాధించింది. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. 25 వారాలుగా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ… 23 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. దీనితో ‘12th ఫెయిల్’ సినిమా సాధించిన అరుదైన ఘనత పట్ల ఆనందం వ్యక్తంచేస్తూ దర్శకుడు విధు వినోద్ చోప్రా తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారుతోంది.
12th Fail Movie…
‘‘ఈ హిట్ చిత్రం విడుదలై 25 వారాలు పూర్తయింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. 23 ఏళ్ల తర్వాత ఈ మైలురాయిని సాధించిన తొలి చిత్రంగా ‘12th ఫెయిల్(12th Fail)’ నిలిచింది. మా కలను నిజం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది’’ అని పేర్కొన్నారు. దీనిపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ‘గొప్ప సినిమా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మరోవైపు ఈ మూవీ చైనాలో విడుదలకు సిద్ధమవుతుంది. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ… ‘మంచి కథకు సరిహద్దులు దాటి ఆదరణ లభిస్తుందని నమ్ముతాను. చైనాలో విడుదలవుతుందంటే… కొత్త ప్రేక్షకులకు చేరుకోవడం మాత్రమే కాదు… ఈ కథ మరికొందరిలో స్ఫూర్తి నింపనుందని అర్థం. విడుదలైన ప్రతీ ప్రాంతంలో దీనికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. చైనీస్ ప్రేక్షకులు దీనితో ఎలా కనెక్ట్ అవుతారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ఇక ఈ చిత్రం తర్వాత తన కెరీర్ మారిందన్నారు హీరో విక్రాంత్ మస్సే. ‘ఈ సినిమాతో నేను విజయాన్ని చూశాను. ఆరు నెలల క్రితం పరిస్థితి వేరేగా ఉండేది. ఇప్పుడు వచ్చిన గుర్తింపుని నేను ఎప్పటికీ కొనసాగించాలనుకుంటున్నా. ప్రేక్షకులు వాళ్ల కష్టార్జితంతో థియేటర్లకు వెళ్లి చూస్తారు. వాళ్లకు వినోదాన్ని పంచడం నటీనటుల బాధ్యత.
Also Read : Attili Anantaram: ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంతరాం మృతి !