Munjya OTT : సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన 100 కోట్ల సినిమా ‘మంజ్య’

తీరా అక్క‌డికి వెళ్లాక ముంజ్యా అనే బ్ర‌హ్మ రాక్ష‌సుడు అవ‌హించిన ఓ భారీ వృక్షం బిట్టును బంధిస్తుంది...

Munjya : ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన హ‌ర్ర‌ర్ కామెడీ చిత్రం ముంజ్య(Munjya) ఎట్ట‌కేల‌కు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. రూ.30 కోట్ల‌తో రూపొందించిన ఈ సినిమా జూన్ 7న చిన్న మూవీగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. రూ. 135 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి ఈ ఏడాది బాలీవుడ్ మొద‌టి హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. అభ‌య్ వ‌ర్మ, శ‌ర్వారి, స‌త్య‌రాజ్, మోనా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా ఆదిత్య సర్పోత్దార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పుణే సిటీలో బిట్టు అనే యువ‌కుడు త‌న త‌ల్లితో క‌లిసి ఉంటాడు. బాల్యం నుంచే అమాయ‌కుడిగా, పిరికివాడిగా,భ‌య‌స్తుడిగా పెరుగుతాడు. ఓ రోజు త‌మ బంధువుల పెండ్లి వేడుక కోసం త‌న స్వ‌గ్రామం కొంక‌న్‌కు వెళ‌తాడు. అక్క‌డ ఓ సంద‌ర్భంలో బిట్టు చిన్నాన బాలు త‌న అన్న మ‌ర‌ణం గురించి, ఓ స్థలంలోని చెట్టు గురించి మాట్లాడ‌డం విన్న బిట్టు ఆ ప్రాంతానికి వెళ‌తాడు.

Munjya Movie OTT Updates

తీరా అక్క‌డికి వెళ్లాక ముంజ్యా అనే బ్ర‌హ్మ రాక్ష‌సుడు అవ‌హించిన ఓ భారీ వృక్షం బిట్టును బంధిస్తుంది. ఇది గ‌మ‌నించిన బిట్టు నాన‌న్మ్మ వెళ్లి కాపాడుతుంది. కానీ ముంజ్యా(Munjya) బిట్టుతో పాటే వెళ్లి త‌న నానమ్మ‌ను చంపేస్తుంది. ఆపై బిట్టుతో పాటే ప‌య‌నిస్తూ వేదిస్తూ ఉంటుంది.. ఓ రోజు మున్ని అనే యువ‌తిని క‌నిపెట్టి చెప్పాల‌ని లేకుంటే మీ ఆమ్మ‌ను చంపేస్తాన‌ని ముంజ్యా వార్నింగ్ ఇస్తుంది. దీంతో బిట్టు మున్నిని వెతికే ప‌నిలో పెడ‌తాడు.

ఈక్ర‌మంలో అనేక ర‌హ‌స్యాలు బ‌య‌ట న‌డుతుంటాయి. చివ‌ర‌కు బిట్టును ముంజ్యా చెర నుంచి బ‌య‌ట ప‌డ‌గ‌లిగాడా లేదా ముంజ్యా స్టోరీ ఏంటి, మున్ని ఎవ‌రు అస‌లు త‌న ఊరిలో 50 ఏండ్ల క్రితం ఏం జ‌రిగింది అనే ఇంట్రెస్టింగ్ క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా ప్ర‌తి ఒక్క‌రినీ అల‌రిస్తుంది. ఇప్పుడీ చిత్రం చాలా గ్యాప్ త‌ర్వాత డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోస్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం కేవ‌లం హిందీ భాష‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది. భ‌విష్య‌త్తులో ఇత‌ర భాష‌ల‌లోనూ స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉంది. మంచి హ‌ర్ర‌ర్‌, థ్రి ల్ల‌ర్ చూడాల‌నుకునేవారు ఈ ముంజ్య మూవీని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మిస్ చేయ‌కండి.

Also Read : Committee Kurrollu OTT : ఓటీటీకి సిద్దమవుతున్న 1990’s కిడ్స్ సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’

CinemaMunjyaTrendingUpdatesViral
Comments (0)
Add Comment