Hero Vijay-Amitabh : మ‌రో తెలుగు మూవీలో బిగ్ బి

రౌడీ..రాహుల్ చిత్రంలో క‌న్ ఫ‌ర్మ్

Amitabh  : ఏ పాత్రలో లీన‌మై పోయి న‌టించే న‌టుడు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్(Amitabh). వ‌య‌సు పెరిగినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఓ వైపు సినిమాల‌లో న‌టిస్తూనే మ‌రో వైపు యాంక‌ర్ గా జ‌నాద‌ర‌ణ పొందిన షోస్ చేస్తూ దూసుకు పోతున్నారు. ప్ర‌త్యేకించి బాలీవుడ్ ప‌రంగా నిక‌ర ఆస్తుల్లో త‌ను రెండో స్థానంలో కొన‌సాగుతున్నారు. ఒక‌ప్పుడు ఐపీ పెట్టిన ఈ న‌టుడు, మాజీ ఎంపీ ఉన్న‌ట్టుండి ఫీనిక్స్ ప‌క్షి లాగా తిరిగి తెర‌పైకి వ‌చ్చాడు. త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

Amitabh Bachchan Movie with Vijay Deverakonda

ఎవ‌రైనా 60 ఏళ్లు దాటారంటే ఇంకెందుకు సినిమాలంటూ కాల‌క్షేపం చేస్తూ ఉంటారు. కానీ అమితాబ్ బ‌చ్చ‌న్(Amitabh ) అలా కాదు. త‌ను నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతూనే ఉంటారు. ఈవెంట్స్ లు, షోస్ , సినిమాలు ఇలా ప్ర‌తి చోటా త‌ను పార్టిసిపేట్ చేస్తూ లైఫ్ కు కొత్త అర్థాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

వ‌య‌సు శ‌రీరానికే కానీ మ‌న‌సుకు ఎందుకు ఉంటుందంటాడు బిగ్ బి . త‌న త‌న‌యుడు ఇబ్బంది ప‌డుతుంటే..కోడలు ఐశ్య‌ర్య రాయ్ బ‌చ్చ‌న్ అడ‌పా ద‌డ‌పా న‌టిస్తుంటే త‌ను మాత్రం నిత్యం లైమ్ లైట్ లో ఉంటూ ఇత‌ర నటీ న‌టుల‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేస్తున్నాడు. ఈ మ‌ధ్య‌న తెలుగు సినిమాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నేను తెలుగు వాడినే..నన్ను కూడా గుర్తు పెట్టుకోండి అంటూ చెప్పిన మాట‌లు వైర‌ల్ గా మారాయి.

అమితాబ్ బ‌చ్చ‌న్ తొలుత మెగాస్టార్ న‌టించిన రాయ‌ల‌సీమ నేప‌థ్యం క‌లిగిన పోరాట యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి చిత్రంలో న‌టించాడు. ఉయ్యాల‌వాడ‌కు గురువు పాత్ర‌లో ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత నాగ్ అశ్విన్ ప్ర‌భాస్ తో తీసిన క‌ల్కి మూవీలో త‌ళుక్కున మెరిశాడు. త‌ను అశ్వ‌ద్దామ పాత్ర‌లో లీన‌మ‌య్యాడు. దీంతో తెలుగు ద‌ర్శ‌కులు బిగ్ బీపై ఫోక‌స్ పెడుతున్నారు. తాజాగా రాహుల్ సాంకృత్య‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మూవీ తీసేందుకు రెడీ అయ్యాడు. ఇందులో కీల‌క పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించ‌నున్నార‌ని టాక్.

Also Read : Razakar Movie Success :ఆహాలో తెలంగాణ ‘ర‌జాకార్’ సూప‌ర్ 

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com