Amitabh Bachchan : ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన రష్మిక మంధాన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. అచ్చం తన లాగా ఉన్న మార్ఫింగ్ వీడియోను షేర్ చేయడంపై రష్మిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది.
Amitabh Bachchan Serious
ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తన్న రష్మిక వీడియో గురించి తీవ్రంగా స్పందించారు బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan). ఇలాంటి చవకబారు పనులు చేయడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు. టెక్నాలజీ ఉంది కదా అని వ్యక్తులను టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు.
వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి మార్ఫింగ్, ఫేక్ వీడియోలు రాకుండా ఉండేలా ఓ చట్టం కూడా తీసుకు రావాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు.
దీనిని సీరియస్ గా తీసుకుంటున్నామని, దోషులు ఎవరో, ఎవరు ఎందుకు దేని కోసం ఈ వీడియోను షేర్ చేశారో తాము తెలుసుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. మనం నటించే ముందు ఎలా నటిస్తున్నామనే దానిపై ఒకసారి ఆలోచించు కోవాలని స్పష్టం చేశారు రాజీవ్ చంద్రశేఖర్.
Also Read : Rashmika Mandhanna : రష్మిక ఫేక్ వీడియో వైరల్