Amitabh Bachchan : బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన శుక్రవారం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు బి-టౌన్‌లో పుకార్లు వచ్చాయి. కాలులో రక్తం గడ్డకట్టడం వల్ల యాంజియోప్లాస్టీ చేయించుకున్నారని బాలీవుడ్ మీడియా కథనాన్ని ప్రచురించింది. అయితే ఆయన కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Amitabh Bachchan Admitted
తాజాగా ఆయన తన బ్లాగ్‌లో కల్కి 2898 AD సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించేందుకు టీమ్ అంతా కష్టపడుతున్నారని అన్నారు. అనుకున్న ప్రకారం సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.
Also Read : Allu Arjun : టాలీవుడ్ వెర్సెస్ బాలీవుడ్ ఇండస్టరీపై కీలక వ్యాఖ్యలు చేసిన బన్నీ