500 కోట్లు టార్గెట్ గా అమీర్ ఖాన్ మాస్టర్ ప్లాన్ !
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ ఫర్ఫెక్ట్‌గా పిలిచే అమీర్ ఖాన్ మాస్టర్ ప్లాన్ వేశారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని పాలి హిల్‌లో ఉన్న విర్గో కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన తన ప్రాపర్టీని రీ డెవలప్‌మెంట్‌కు ఇచ్చారు. రూ. 500 కోట్లు సంపాదన టార్గెట్ గా ఈ ప్రాపర్టీను అమీర్ డవలెప్ మెంట్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మ్యాన్ ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్ అధికారికంగా దృవీకరించింది. ఇందులో 24 ఫ్లాట్‌లు ఉండగా వాటిలో అమీర్ ఖాన్‌కు తొమ్మిది ఫ్లాట్‌లు ఉన్నాయి. అయితే అమీర్ ఖాన్ ప్రాపర్టీ రీడెవలప్‌మెంట్ ఒప్పందం నిబంధనలను మాత్రం మ్యాన్ ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్ బయటకు వెల్లడించలేదు. ఈ ప్రాపర్టీలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టి విక్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్ నుంచి రూ. 500 కోట్ల టాప్ లైన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ప్రాజెక్ట్‌లో లగ్జరీ 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను అభివృద్ధి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది 2024 మధ్యలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.