Hero Amir Khan-Dangal :వ‌సూళ్ల‌లో అమీర్ ఖాన్ దంగ‌ల్ నెంబ‌ర్ 1

అమీర్ ఖాన్ కీ రోల్

Dangal : భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రాల‌లో అమీర్ ఖాన్ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించి మెప్పించిన దంగ‌ల్(Dangal) నెంబ‌ర్ వ‌న్ గా ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ చిత్రం 2016లో విడుద‌లైంది. ప్ర‌ముఖ కుస్తీ క్రీడాకారుడు మ‌హావీర్ సింగ్ ఫోగ‌ట్ , కూతూళ్ల జీవితాన్ని ఆధారంగా తీసుకుని చిత్రాన్ని తీశారు.

Amir Khan Dangal Movie

ఈ మూవీకి నితీశ్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సిద్దార్థ్ రాయ్ క‌పూర్ , అమీర్ ఖాన్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హించారు. ఎన్నో ప్ర‌శంస‌లు, మ‌రెన్నో అవార్డులు, పురస్కారాలు ద‌క్కాయి దంగ‌ల్ కు. ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 2,122 కోట్లు వ‌సూలు చేసింది. ఆ చిత్రం వ‌సూళ్ల ద‌రి దాపుల్లోకి ఏ సినిమా రాలేక పోయింది.

ఇక వ‌సూళ్లు చేసిన సినిమాల ప‌రంగా చూస్తే ఇలా ఉన్నాయి. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ‌న్నీ, ర‌ష్మిక న‌టించిన పుష్ప‌2 ది రూల్ రూ. 1871 కోట్లు క‌లెక్ష‌న్ చేసింది. ఆ త‌ర్వాతి స్థానం ఎస్ఎస్ రాజ‌మౌళి తీసిన బాహుబ‌లి రూ. 1788.05 కోట్లు వ‌సూలు చేసింది.

స‌ల్మాన్ ఖాన్ న‌టించిన బ‌జ‌రంగీ భాయిజాన్ రూ. 921.93 కోట్లు వ‌సూలు చేయ‌గా సీక్రెట్ సూప్ స్టార్ రూ. 912.75 కోట్లు, అమీర్ ఖాన్ న‌టించిన వ్యంగ్య చిత్రం పీకే రూ. 792 కోట్లు, ర‌జ‌నీకాంత్, అక్ష‌య్ కుమార్ న‌టించిన రోబో 2.0 చిత్రం రూ. 723. 30 కోట్లు వ‌సూలు చేసింది.

Also Read : Pushpa 2 Popular : పుష్ప‌2 వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ రూ. 1871 కోట్లు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com