Allu Sneha Reddy:టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యగా స్నేహా రెడ్డి అందరికీ పరిచయమే. ఆమెకు సినిమాలతో సంబంధం లేకపోయినప్పటికీ… సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది స్నేహారెడ్డి. ఈ క్రమంలో ఆమెకు నెట్టింట ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు సుమారు 10 మిలియన్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారు
Allu Sneha Reddy Workout..
తాజాగా స్నేహారెడ్డి జిమ్లో వర్కవుట్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్నెస్పై శ్రద్ధ వేరే లెవెల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రాన్ని పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలోనూ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప-2 ఊహించని విధంగా డిసెంబర్ కు వాయిదా పడింది.
Also Read : Vicky Kaushal: తన భార్య ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో !