Allu Sirish: అల్లు శిరీష్ ‘బ‌డ్డీ’ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ !

అల్లు శిరీష్ ‘బ‌డ్డీ’ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ !

Hello Telugu - Allu Sirish

Allu Sirish: కోలీవుడ్ యువ దర్శకుడు శామ్ ఆంటోన్ దర్శకత్వంలో అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా ‘బడ్డీ’. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా “బడ్డీ” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆ పిల్ల కనులే..’ రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిళ ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించగా హిప్ హాప్ తమిళ తో కలిసి సంజిత్ హెగ్డే, ఐరా, విష్ణు ప్రియ రవి పాడారు. పెప్పీ మ్యూజిక్‌ తో ట్రెండీ స్టార్ మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారని ట్వీట్ చేశారు.

Allu Sirish Movies

‘ఆ పిల్ల కనులే చూశాక తననే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే , మైకంలో తేలే, మబ్బులు తాకే, ఇద్దరి కథ ఇక మొదలాయే, నింగి నేల కలిశాయో, ఊసులేవో పలికాయో..’ అంటూ మంచి రొమాంటిక్ నెంబర్ గా సాగుతుందీ పాట. ఈ మెలోడీ లవ్ సాంగ్… మ్యూజిక్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. లిరికల్ సాంగ్ లోని విజువల్స్ బాగున్నాయని నెటిజన్లు కామెంట్లుపెడుతున్నారు. మ్యూజిక్ ఫ్రెష్ గా ఉందని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్(Allu Sirish).. ఆచితూచి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రొమాంటిక్‌ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా… ఆడియన్స్ కు ఆకట్టుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయింది. కమర్షియల్‌ గా కూడా పెద్దగా ఆడలేదు. ఆ మూవీ తర్వాత అల్లు శిరీష్ హీరోగా ‘బడ్డీ’ చిత్రాన్ని అనౌన్స్ చేసి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఆ సినిమా నుంచి మళ్లీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీనితో ఆ మూవీ అసలు ఉందా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు ఆడియన్స్. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ‘బడ్డీ’ మూవీ.. అనేక కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ కు రెడీ అవుతుంది. దీనితో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

Also Read : Rajanikanth: ‘వెట్టయాన్‌’ ను పూర్తి చేసిన తలైవా !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com