Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ఓ వ్యక్తి జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి అర్జున్(Allu Arjun) ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడని తెలిపారు. ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని, దీనిని అభిమాన సంఘానికి పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశాడు. ఆర్మీ అంటే జాతీయ సమగ్రత, దేశ భద్రతకు సంబంధించిన అంశమని, అల్లు అర్జున్ మాత్రం.. ఇవేవీ పట్టించుకోకుండా పలు వేదికలపై తనకు ఆర్మీ ఉందని ప్రకటించాడని పేర్కొన్నారు. వెంటనే అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయాలని బైరి శ్రీనివాస్ గౌడ్ పోలీసులను కోరారు.
Allu Arjun-Pushpa 2..
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా ట్యాగ్ వదిలేసే క్రమంలో అల్లు ఆర్మీని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఆయన ఏ వేడుకకు హాజరైన ‘అల్లు ఆర్మీ’ అంటూ ఓ బ్యాచ్ జనంలో బ్యానర్లు ఎగరేస్తూ ఉంటారు. రీసెంట్‌గా ‘పుష్ప ది రూల్’ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం కేరళకు చెందిన కొచ్చిలో జరిగిన వేడుకలో కూడా అల్లు అర్జున్ ఆర్మీ ప్రస్తావన తెచ్చారు. తన అభిమానులకు ఆర్మీ అనే పేరును కొచ్చి అభిమానులే సృష్టించారని ఆయన చెప్పుకొచ్చారు. అలా ఆయన ఎక్కడికి వెళ్లినా.. తన ఆర్మీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇదే ఇప్పుడు గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్‌కు ఇబ్బందిగా మారింది. అందుకే ఆయన అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ది రూల్’ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌ని నిర్వహిస్తున్నారు. పాట్నా, చెన్నైయ్, కొచ్చి, ముంబై ఇలా వరుస ఈవెంట్స్‌తో క్షణం తీరిక లేకుండా టీమ్ సినిమాను ప్రమోట్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
Also Read : NTR-Prasanth Neel : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా నుంచి మరో కీలక అప్డేట్