Allu Arjun: రాజ‌మౌళి సినిమా రేంజిలో పుష్ప-2 బడ్జెట్ ?

రాజ‌మౌళి సినిమా రేంజిలో పుష్ప-2 బడ్జెట్ ?

Hello Telugu - Allu Arjun

Allu Arjun: భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమా తీయడంతో పాటు ప్రమోషన్ చేయడంతో దర్శక ధీరుడిది ప్రత్యేక స్థానం. దీనితో రాజమౌళి సినిమా అంటే టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అందరికీ ప్రత్యేక మైన ఆశక్తి ఉంటుంది. రాజమౌళితో సినిమా అంటే పాన్ ఇండియా స్టార్ అయిపోయినట్లే అనేది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్.

అయితే రాజమౌళితో ఎటువంటి సినిమా చేయకుండానే ‘పుష్ప‌: ది రైజ్’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). అంతేకాదు ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు. దీనితో ‘పుష్ప‌: ది రైజ్’ కు సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప‌: ది రూల్’ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో చేరింది.

Allu Arjun – ‘పుష్ప‌: ది రూల్’ పై పెరుగుతున్న అంచానాలు

ఓ సాధారణ కూలీ… ఎర్ర చందనం స్మగ్లర్ గా ఎలా మారాడు అనే కథాంశంతో పుష్ప అనే సినిమాను ప్రారంభించిన దర్శకుడు సుకుమార్… ప్రీ పొడక్షన్ అయ్యేసరికి ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘పుష్ప‌: ది రైజ్’ అంచనాలకు మించి హిట్ కావడం… బాక్సాఫీసు ముందు కలెక్షన్ల వర్షం కురిపించడంతో… ఇప్పుడు పుష్ప పార్ట్ 2గా(Pushpa -2) తెరకెక్కించబోయే ‘పుష్ప‌: ది రూల్’ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంచనాలకు తగ్గట్లుగానే నిర్మాతలకు కూడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి గంగమ్మ జాతర సెట్ నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది.

సుమారు యాభై కోట్లతో గంగమ్మ జాతర సెట్ షూటింగ్…

సినిమాకు ఉన్న క్రేజ్, వ‌స్తున్న బిజినెస్ ఆఫ‌ర్లు చూస్తున్న నిర్మాత‌లు… ఖ‌ర్చు గురించి అస్స‌లు వెనుకాడ‌టం లేదని సమాచారం. చిన్న పెద్ద సీన్లు అని తేడా లేకుండా ఎంత కావాలంటే అంత పెట్టేస్తున్నార‌ట‌. భారీ సెట్టింగ్స్ వేసి వందలాది మంది ఆర్టిస్ట్ లతో రిహార్సల్స్ వేసి మరీ సినిమా షూటింగ్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఒక్క గంగమ్మ జాతర సెట్ కే దాదాపు యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టారని సినీవర్గాల టాక్. దీనితో ‘పుష్ప‌: ది రూల్’ షూట్ మొదలయ్యే సమయానికి 200 కోట్లు అన్నుకున్న బడ్జెట్ ఎప్పుడో దాటేసిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు అదనంగా మరో యాభై శాతం కూడా ఖర్చు పెట్టినట్లు అనధికారిక సమాచారం. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు సుమారు 300 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసి రాజమౌళి సినిమా రేంజ్ కు ‘పుష్ప‌: ది రూల్’ చేరువలో ఉంది. ఇదే ఖర్చు కొనసాగితే రాజమౌళి రేంజ్ ను కూడా దాటేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకుల టాక్.

ప్రమోషన్, మార్కెటింగ్ లో రాజమౌళిని సుకుమార్ ను మ్యాచ్ చేస్తారా !

సినిమా మీద ఎంత బడ్జెట్ పెట్టినప్పటికీ… దానిని ప్రమోషన్, మార్కెటింగ్ చేయడంతో కూడా దర్శకుడు రాజమౌళి దిట్ట. దీనికి బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాలు నిలువెత్తు నిదర్శనం. ఈ నేపథ్యంలో ‘పుష్ప‌: ది రూల్’ సినిమాతో రాజమౌళి రేంజ్ బడ్జెట్ కు చేరుకున్న సుకుమార్ … ఆ స్థాయిలో సినిమా ప్రమోషన్, మార్కెటింగ్ చేయగలరా అనేది ఆశక్తికరంగా మారింది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తో పాటు అతని తండ్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్… ఖఛ్చితంగా సినిమాకు ప్రమోషన్ కు ఉపయోగపడతారనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ లో రాజమౌళిని దాటిన సుకుమార్… ప్రమోషన్ లో ఏ మేర రాజమౌళిని మ్యాచ్ చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే…

Also Read : Priyamani: మోస్ట్ డేంజరస్ లేడీగా ప్రియమణి ‘భామా కలాపం 2’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com