Pushpa 2 : అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రిలీజ్ 11500 థియేటర్లోనా..

దీంతో బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా ‘పుష్ప2’ రికార్డు సృష్టించనుండడం ఖాయమేనని అంటున్నారు...

Hello Telugu - Pushpa 2

Pushpa 2 : ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప: ది రూల్‌’ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల రోజే ఈ సినిమా రికార్డులు సృష్టించనుంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్ లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ విషయానికన మేకర్స్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో 11,500 స్క్రీన్స్ లో దీన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు భారీగా ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఇండియాలో 6,500.. ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటివరకు ఏ ఇండియన్‌ సినిమా ఈ స్థాయిలో విడుదల కాలేదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Pushpa 2 Movie Updates

దీంతో బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా ‘పుష్ప2(Pushpa 2)’ రికార్డు సృష్టించనుండడం ఖాయమేనని అంటున్నారు. ఈ చిత్రం కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో ఫ్యాన్‌ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమాను నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read : Alia Bhatt : బాడీ షేమింగ్ పై భగ్గుమన్న బాలీవుడ్ భామ అలియా భట్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com