Allu Arjun : శ్రీ తేజ ను కలవలేక పోతున్న అంటూ భావోద్వేగ ట్వీట్ చేసిన బన్నీ

బాధిత కుటుంబానికి రూ.25లక్షలు సాయం అందిస్తానని ఇప్పటికే అల్లు అర్జున్‌ ప్రకటించారు...

Hello Telugu - Allu Arjun

Allu Arjun : సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలైన శ్రీతేజ్‌ గురించి అల్లు అర్జున్‌ స్పందించారు. కేసు విచారణ కొనసాగుతున్నందున శ్రీతేజ్‌ను కలవలేకపోతున్నానన్నారు. గాయపడిన బాలుడు ప్రస్తుతం కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు అతని విషయంలో ఆందోళన చెందుతున్నానని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘శ్రీతేజ్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం అతడిని కలవలేక పోతున్నా. వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతున్న. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతా. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నా’’ అని అల్లు అర్జున్‌ తెలిపారు.

Allu Arjun Tweet

బాధిత కుటుంబానికి రూ.25లక్షలు సాయం అందిస్తానని ఇప్పటికే అల్లు అర్జున్‌ ప్రకటించారు. చికిత్స ఖర్చు భరిస్తానని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈ నెల 13న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంచల్‌గూడ జైలులో ఆ రాత్రంతా ఉన్న ఆయన.. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు.

Also Read : Ghaati Movie : క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న స్వీటీ మూవీ రిలీజ్ డేట్ ఇదే

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com