Bigg Boss 8 : బిగ్బాస్ సీజన్ 8 చివరి ఘట్టానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ప్రేరణ, గౌతమ్, నబీల్, నిఖిల్, అవినాష్ ఉన్నారు. అయితే ఈవారం మొత్తం హౌస్మేట్స్ జర్నీ వీడియోస్ చూపిస్తూ.. లేదా హౌస్మేట్స్ మధ్య ఫన్నీ టాస్కులు పెడుతూ ఎంటర్టైన్ చేస్తారనుకుంటే.. అదేం లేకుండా వరుసగా సీరియల్ ప్రమోషన్లతో విసుగుపుట్టిస్తున్నాడు బిగ్బాస్(Bigg Boss 8). సీరియల్ బ్యాచ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ గేమ్స్, క్వశ్చన్స్ ఉంటానుకుంటే అదేం లేకుండా వచ్చామా.. డాన్స్ చేశామా.. వెళ్లామా అన్నట్లుగా సాగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు గ్రాండ్ ఫినాలే ఎప్పుడు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్ టైటిల్ రేసులో గౌతమ్, నిఖిల్ మధ్య హోరా హోరీ పోటీ నడుస్తున్న సంగతి తెలిసింది.
Bigg Boss 8 Chief Guest…
గౌతమ్,నిఖిల్ ఇద్దరిలో విన్నర్ ఎవరనేది మరో మూడు రోజుల్లో తెలియనుంది. ప్రస్తుతం ఓటింగ్ లో టాప్ లో గౌతమ్ దూసుకుపోతుండగా.. స్వల్ప తేడాతో నిఖిల్ రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఓటింగ్ శాతంలో ఎక్కువగా మార్పులు జరగడం లేదు. ఇక మూడో స్థానంలో నబీల్.. నాలుగో స్థానంలో ప్రేరణ ఉండగా.. ఐదో స్థానంలో అవినాష్ ఉన్నాడు. అయితే బిగ్బాస్(Bigg Boss 8) గ్రాండ్ ఫినాలేకు ప్రతిసారి ఒక సెలబ్రెటీ గెస్ట్ రావడం కామన్. కానీ లాస్ట్ సీజన్ 7కు మాత్రం ఎవరు అతిథిగా రాలేదు.హోస్ట్ నాగార్జున మాత్రమే విన్నర్ కు ట్రోఫీ అందించారు. అయితే ఈసారి సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారనే టాక్ నెట్టింట జోరుగా నడుస్తోంది. పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 15న జరగనున్న బిగ్బాస్ గ్రాండ్ ఫినాలేకు అల్లు అర్జున్ అతిథిగా రానున్నారనే ప్రచారం నడుస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read : Dhanush-Nayanthara : ధనుష్, నయనతార కేసులో నయన్ కు మద్రాసు కోర్టు నోటీసులు