Allu Arjun: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య బంధం ప్రత్యేకమైనది. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ కు అనేక సందర్భాల్లో మద్దత్తుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమా ఫంక్షన్లలో అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేయడమే కాకుండా… పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయనపై పలువురు రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలపై కూడా ఘాటుగా స్పందించారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాన్ కు మద్దత్తుగా ప్రచారం కూడా చేసారు. అయితే గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకు, అల్లు అరవింద్ ఫ్యామిలీకు మధ్య గ్యాప్ వచ్చిందనే పుకార్లు వచ్చాయి. అటువంటి పుకార్లకు చెక్ పెడుతూ ఇటీవల బెంగుళూరులో ఫాం హౌస్ లో సంక్రాంతి వేడుకలు కూడా జరపుకున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ ప్రముఖుల నుండి మద్దత్తు వస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్(Allu Arjun) నుండి మద్దత్తు ప్రకటిస్తారా… లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయ మద్దతు తెలుపుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)… తన సోషల్ మీడియా ఎక్స్ వేదిక పోస్ట్ చేసారు. ‘‘పవన్‌కల్యాణ్‌గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా’’ అని ఈ పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ వీడియోలో వైరల్ గా మారుతోంది.
Allu Arjun – పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న సినీ నటుల మద్దత్తు
పిఠాపురం ప్రజలు పవన్ ను గెలపించాలని కోరుతూ అగ్ర కథానాయకుడు చిరంజీవి వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి వీడియోను తన ఎక్స్ వేదికగా పంచుకున్న రామ్‌చరణ్ ‘భవిష్యత్ కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్‌ను గెలిపించండి’ అని పోస్ట్ చేశారు. జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు హీరో నాని ప్రకటించారు. ‘పవన్ కళ్యాణ్… మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
‘ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోసం మీ కృషిని, ప్రయత్నాలను మొదటి రోజు నుంచి చూస్తున్నాను. కోట్ల మందికి మీరు ఆశాదీపం. మీరు గెలిచి ప్రజల తలరాతలు మార్చాలని కోరుకుంటున్నాను. ఇప్పటి జనాలకు మీరు కావాలి’ అని హీరో రాజ్ తరుణ్ జనసేనకు సపోర్ట్ చేశారు. అలాగే పవన్‌కు మద్దతు తెలుపుతున్నట్లు యువ నటుడు తేజ సజ్జా తన ఇన్ స్టాలో స్టోరీ పెట్టారు. వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, హాస్య నటులు ఆది, గెటప్ శ్రీను తదితరులు పవన్‌కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నటుడు సంపూర్ణేష్ బాబు కూడా పవన్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు.
Also Read : Aditya Roy Kapur: హీరోయిన్ తో బ్రేకప్ ! మరో బ్యూటీతో బాలీవుడ్ హీరో పార్టీ !