Aarya : ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినీ కెరీర్ లో మరిచి పోలేని చిత్రం ఆర్య(Aarya). డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. సుక్కు, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి మూవీ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. ఆర్య సినిమాను సీక్వెల్ గా ఆర్య-2 తీశాడు. ఇందులో బన్నీ నెగటివ్ పాత్ర పోషించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉండగా ఆర్య మూవీ పూర్తి చేసుకుని 22 సంవత్సరాలు అయ్యింది.
Bunny Aarya Movie 22 Years Completed
సుకుమార్ దర్శకత్వంలో ఆర్య, ఆర్య-2తో పాటు పుష్ప-2 సీక్వెల్ తీశాడు. పరుగు, పుష్ప-1, పుష్ప2 సీక్వెల్ తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారత దేశ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఏకంగా రూ. 1867 కోట్లు సాధించింది. అమీర్ ఖాన్ మూవీ తర్వాత 2వ ప్లేస్ దక్కించుకుంది. అల్లు అర్జున్ తన అసాధారణమైన నటనతో ఆకట్టుకున్నాడు. లక్షలాది మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. ఈ విజయం ఒకే రోజులో దక్కలేదు. రాత్రికి రాత్రి వచ్చింది కాదు. అచంచలమైన సంకల్పం, ఎదురు దెబ్బలను ఎదుర్కొన్నాడు.
బన్నీ సినీ కెరీర్ కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో ప్రారంభమైంది. ఇది జాతీయ అవార్డును సాధించింది. ఒకప్పుడు యువ హీరోగా గుర్తింపు పొందిన తను భారత దేశంలోనే అత్యంత జనాదరణ పొందిన నటుడిగా అవతరించాడు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందాడు. హ్యాపీ, వినోదం వంటి భిన్నమైన కంటెంట్ కలిగిన పాత్రలను పోషించాడు . గోన గన్నారెడ్డి లో చారిత్రాత్మకమైన పాత్రను పోషించాడు.
Also Read : Hero Ram Charan -Peddi :రామ్ చరణ్ పెద్ది మూవీ కీలక అప్ డేట్