Allu Arjun: రూ.10 కోట్లు యాడ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన బన్నీ !

రూ.10 కోట్లు యాడ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన బన్నీ !

Hello Telugu - Allu Arjun

Allu Arjun: ‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌… జాతీయ అవార్డు అందుకున్న తరువాత మోస్ట్ సెలబ్రేటెడ్ స్టార్ గా మారారు. అయితే ఓ కమర్షియల్ యాడ్ విషయంలో అందుకు తగినట్లుగానే హుందాగా వ్యవహరించి అభిమానుల మనసు దోచుకున్నారు బన్నీ. పొగాకు ఉత్పత్తులకు సంబంధించి తన దగ్గరకు వచ్చిన ఓ ప్రకటనను మరో ఆలోచన లేకుండా బన్నీ తిరస్కరించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కమర్షియల్ యాడ్ ద్వారా తన అభిమానులను తప్పుదోవ పట్టించి, వారి ఆరోగ్యానికి నష్టం కలిగేలా ఎప్పుడూ ప్రవర్తించనని ఆ బ్రాండ్ యాజమాన్యానికి తేల్చి చెప్పేసారని టాక్. వరల్డ్‌ టుబాకో డే సందర్భంగా బన్నీ(Allu Arjun) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Allu Arjun…

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప: ది రైజ్‌’. ఈ మూవీ విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా పుష్పరాజ్‌ కు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ పొగాకు ఉత్పత్తుల సంస్థ బన్నిని కలిసింది. తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉండాలని కోరింది. ఈ ఆఫర్‌ను ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించారట. ఈ యాడ్‌ చేస్తే రూ.10 కోట్ల వరకూ ఇస్తామని ఆఫర్‌ చేసినా, చేయనని స్పష్టంగా చెప్పారట. నేరుగా తీసుకోకపోయినా ‘పుష్ప: ది రూల్‌’లో పుష్పరాజ్‌ ధూమపానం చేసే ప్రతి సీన్‌ లోనూ బ్యాగ్రౌండ్‌లో తమ బ్రాండ్‌ లోగో కనిపించేలా చూడాలని కోరిందట. అందుకు కూడా బన్ని నో చెప్పారట.

కేవలం నటన మాత్రమే కాదు, సామాజిక బాధ్యతల విషయంలో అల్లు అర్జున్‌ ముందుంటారు అని ఆయన మరోసారి నిరూపించారు. ఇప్పటికే మొక్కలు నాటే కార్యక్రమానికి తనవంతు ప్రచారం చేస్తూ, అభిమానులను సైతం ప్రోత్సహిస్తున్నారు. డబ్బు, పేరు ప్రఖ్యాతులు కన్నా కూడా అభిమానుల ప్రేమకే ఎక్కువ విలువ ఇస్తానని పలు వేదికలపైనా చెప్పారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘పుష్ప2: ది రూల్‌’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, రావు రమేశ్‌, అనసూయ, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రంలోని పాటలు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి

Also Read : Pooja Hegde: బీచ్ క్లీనింగ్ లో నిమగ్నమైన పూజా హెగ్డే !.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com