Allu Arjun: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)… ఎప్పుడూ ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉంటారు. తన సినిమా అప్‌డేట్స్ తోపాటు పలు ఆసక్తికర విశేషాలను ఆయన నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన పెట్టిన ఓ పోస్ట్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు సర్ ప్రైజ్ లభించిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఆనందం వ్యక్తం చేశారు.
Allu Arjun Surprise Gift..
‘‘గుర్తు తెలియని ఒక వ్యక్తి నాకు సీ.కే. ఒబెరాన్ రాసిన బర్న్‌డ్ బెనీత్ ద ఫైర్ అండ్ డిజైర్ (Burned Beneath the Fire of Desire) పుస్తకాన్ని పంపించారు. అతడి నిజాయితీ, నాపై చూపించిన చొరవతో మనసు నిండింది. ఒక పుస్తక ప్రియుడిగా నాకు ఇది ఆనందాన్ని కలిగించింది. దీనిని రచించిన జెంటిల్‌మెన్ సీకే ఒబెరాన్ కు ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే… అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ కోసం వర్క్ చేస్తున్నారు. 2021లో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ‘పుష్ప ది రైజ్’కు సీక్వెల్‌గా ఇది సిద్ధమవుతోంది. సుకుమార్ దర్శకుడు. రష్మిక కథానాయిక. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప ది రైజ్’ సక్సెస్‌తో పార్ట్ 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయని.. అందుకు తగిన విధంగా ఎంతో శ్రమిస్తూ దీనిని తెరకెక్కిస్తున్నామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.
Also Read : Samantha: సౌత్ సీనియర్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం !