Allu Arjun: ‘యానిమల్’ ను ఆకాశానికి ఎత్తేస్తున్న అల్లు అర్జున్

'యానిమల్' ను ఆకాశానికి ఎత్తేస్తున్న అల్లు అర్జున్

Hello Telugu - Allu Arjun

Allu Arjun: అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్వకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్రి డిమ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘యానిమల్’. డిసెంబరు 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా ఆరు రోజుల్లో రూ. 500 కోట్ల వసూళ్ళు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఇటీవల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… ‘యానిమల్’ సినిమాపై స్పెషల్ రివ్యూ రాయడంతో పాటు దర్శకుడు సందీప్ వంగాను ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ సైతం ఈ చిత్రంపై మనసు పారేసుకున్నారు. ‘యానిమల్’ సినిమాలోని నటులతో పాటు దర్శకుడు సందీప్ వంగాను ఉద్దేశ్యించి అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Allu Arjun – ‘యానిమల్’ సినిమా మైండ్ బ్లోయింగ్ అంటున్న ఐకాన్ స్టార్

‘యానిమల్’ సినిమా గురించి అల్లు అర్జున్(Allu Arjun) తన ట్వీట్ లో మైండ్ బ్లోయింగ్‌, బ్రిలియెన్స్‌ అంటూ కితాబు ఇచ్చారు. రణ్‌బీర్‌ కపూర్ భారతీయ సినిమాను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారని… స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఆయన కొనియాడారు. రష్మిక నటన బ్రిలియంట్ అని… అత్యుత్తమ నటన కనబరిచిందని శ్రీవల్లిని పొగిడారు. బాబీ డియోల్, అనిల్ కపూర్ అద్భుతంగా నటించారన్నారు. మరో నటి త్రిప్రి డిమ్రీ నటనతో ఎందరో హృదయాలను కొల్లగొట్టిందని ప్రశంసించారు. వెరసి ‘యానిమల్’ సినిమా యూనిట్ కు నా ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్ చేసారు

సందీప్ మమ్మల్ని మళ్లీ గర్వపడేలా చేశారు- బన్నీ

దర్శకుడు సందీప్‌ వంగా గురించి రాస్తూ… ‘దర్శకుడు సందీప్ మీరు అన్ని సినిమా పరిమితులను అధిగమించారు. మీరు మరోసారి మా అందరినీ గర్వపడేలా చేశారు. మీ సినిమాలు భవిష్యత్తులో భారతీయ సినిమా ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది!’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు యానిమల్ కచ్చితంగా ఇండియన్ సినిమా క్లాసిక్‌ మూవీస్ లిస్ట్‌లో చేరుతుందని పోస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : Lakshmika Sajeevan: గుండెపోటుతో యంగ్ హీరోయిన్ మృతి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com