Allu Arjun : డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన పుష్ప2 రికార్డుల మోత మోగించింది. దేశ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా బన్నీ ఫేమస్ అయ్యాడు ఈ ఒక్క మూవీతో. దీంతో తన స్టామినా ఏపాటిదో మరోసారి రుజువైంది. ఏకంగా హాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ లో తనకు చోటు దక్కింది.
Allu Arjun Photo in Hollywood Magazine
అంతే కాదు పుష్ప2 ది రూల్ అంటూ ఏకంగా మ్యాగజైన్ కవర్ పై ఫోటో వేసింది. ఈ పత్రిక హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో భారత్ లోనూ అడుగు పెట్టింది. తొలి సంచకపై అల్లు అర్జున్(Allu Arjun) ఫోటోను వేసింది.
అంతే కాకుండా దీనికి సంబంధించిన ఫోటో, వీడియోలను షేర్ చేసింది సదరు పత్రిక. ఈ సందర్బంగా అల్లు అర్జున్ తో కూడా ఇంటర్వ్యూ చేసింది.
పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా. ప్రపంచ వ్యాప్తంగా నేనిమిటో రుజువు చేసుకున్నా. కథ బలంగా ఉంటే సక్సెస్ దానంతట అదే వస్తుందని నా నమ్మకం. ప్రత్యేకించి పుష్ప, పుష్ప2 సినిమాలు ఇండియన్ సినిమాను తిరగ రాశాయి. నిబద్దత, పట్టుదల, అంకిత భావం, చేసే పనిపట్ల శ్రద్ద విజయానికి దారి తీసేలా చేస్తాయని పేర్కొన్నాడు అల్లు అర్జున్. నాకు రేపు అన్నదే ముఖ్యం. ఇవాళ ఏం జరిగిందనేది పట్టించుకోనని చెప్పాడు. సినిమాలు, ఇల్లు , నా కుటుంబం తప్ప వేరే ధ్యాస అనేది ఉండదన్నాడు బన్నీ.
ఇదిలా ఉండగా పుష్ప2 మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. తమ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 1879 కోట్లు సాధించిందని వెల్లడించారు.
Also Read : Swara Bhasker Shocking :స్వర భాస్కర్ షాకింగ్ కామెంట్స్