Allu Arjun-Pushpa 2 : నా లైఫ్ లో నేను మొదటినుంచి సాధించింది చెన్నై నుంచే..

ఇంతగా నా లైఫ్‌ మారటానికి కారణమైన వ్యక్తి ఎవరా అంటే నేను సుకుమార్‌ పేరే చెబుతా...

Hello Telugu - Allu Arjun-Pushpa 2

Allu Arjun : “నా ఫ్యాన్సే నా ఆర్మీ . వాళ్లంటే నాకు పిచ్చి. వాళ్ల ప్రేమకు ధన్యవాదాలు. వాళ్ల వెయిటింగ్‌ను నేను వృథా కానివ్వను. అభిమానుల ప్రేమ నాపై తగ్గకుండా డిసెంబర్‌ 5న అందరి హృదయాల్లో వైల్డ్‌ ఫైర్‌ను తీసుకొస్తాను’’ అని అల్లు అర్జున్‌(Allu Arjun) అన్నారు. ఆయన కథానాయికుడిగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పుష్ప: ది రూల్‌(Pushpa 2)’. రష్మిక కథానాయిక కథానాయిక . మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ‘కిస్సిక్‌’ అంటూ సాగే ప్రత్యేక గీతంలో డాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల కనిపిస్తారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో ఈ పాటను విడుదల చేశారు.

Allu Arjun Comment..

అల్లు అర్జున్‌(Allu Arjun) మాట్లాడుతూ.. ‘ ‘నాకు చెన్నైతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడికి వస్తే ఆ ఫీలే వేరు. మీ జీవితంలోని తొలి 20 ఏళ్లు ఎలా గడిపారో.. మిగతా జీవితం అలా ఉంటుంది. నా లైఫ్‌లో ఫస్ట్‌ 20 ఇయర్స్‌ చెన్నైలోనే గడిచాయి. నేనేం సాధించినా అదంతా చెన్నైకే అంకితం. ‘మైత్రీ మూవీ మేకర్స్‌’ నిర్మాతలు లేకపోతే ఈ సినిమా అసాధ్యం. మాకు సొంత నిర్మాణ సంస్థ ఉన్నా చెబుతున్నా.. ‘పుష్ప(Pushpa)’ని మైత్రీ మూవీ మేకర్స్‌ చేసినట్టు ఏ సంస్థా చేయలేదు. ఇక డైరెక్టర్‌ సుకుమార్‌ గురించి చెప్పాలంటే తను లేకపోతే ఆర్య లేదు. ఆ సినిమా వల్లనే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే నాకు తొలి సినిమాను హిట్‌ మూవీగా ఇచ్చారు డైరెక్టర్‌ రాఘవేంద్రరావుగారు. అయితే ఆ సినిమా తర్వాత నేను ఏడాదిపాటు ఖాళీగా ఉన్నాను. కథలు వింటూ ఉండేవాడిని. నాతో సినిమా చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో సుకుమార్‌ వచ్చి ఆర్య చేశారు. తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు.

ఇంతగా నా లైఫ్‌ మారటానికి కారణమైన వ్యక్తి ఎవరా అంటే నేను సుకుమార్‌ పేరే చెబుతా. ఆయనెంతో సిన్సియర్‌ డైరెక్టర్‌. ఇంత పెద్ద ఈవెంట్స్‌ జరుగుతున్నా.. ఆయన ేస్టజ్‌పైకి రాకుండా పని చేసుకుంటున్నారు. ఇదే చాలు.. ఆయనేంటో చెప్పటానికి. దేవిశ్రీ ప్రసాద్‌ నా మిత్రుడు. నా 20 సినిమాల్లో 10 చిత్రాలకు అతడే సంగీతం అందించాడు. నా చిత్రాలకు ప్రేమతో మ్యూజిక్‌ ఇస్తాడు. ఏ ఈవెంట్‌కి వెళ్లినా డ్యాన్స్‌ చేయమని అడుగుతారు. టికెట్‌ కొనుక్కొని థియేటర్‌కి వెళ్లి చూడవయ్యా అంటాను. కానీ.. చెన్నైలో ఇలా మిమ్మల్ని చూశాక నాకే ఒకసారి డ్యాన్స్‌ చేయాలి అనిపించింది. అన్నీ రీల్స్‌లో ఛానల్స్‌లో ఇది వైరల్‌ అయిపొద్ది. ఇప్పటివరకు ఎప్పుడూ నేను ేస్టజ్‌ మీద డ్యాన్స్‌ చేయలేదు. దేవిశ్రీ ప్రసాద్‌ లేకుండా నా జర్నీ సాధ్యమయ్యేది కాదు. నాలుగేళ్లుగా రష్మికను చూస్తునే ఉన్నాను.

ఈ సినిమాలో నేను ఇంత మంచి పెర్ఫామెన్స్‌ చేశానంటే కారణం.. తను ఇచ్చిన కంఫర్టే. నేను కెరీర్‌లో తొలిసారి ఓ పాటకు డాన్స్‌ చేేసటప్పుడు ముందుగానే జాగ్రత్తపడ్డాను. అందుకు కారణం డాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల తను చాలా హార్డ్‌ వర్కింగ్‌ మాత్రమే కాదు.. సూపర్‌ క్యూట్‌ గర్ల్‌. తను ఈ పాటలో చేసిన డాన్స్‌ గురించి నేను చెప్పటం కాదు.. మీరు చూడాలంతే. అందరికీ నచ్చేస్తుంది’’ అని అన్నారు.

‘‘నేను ఎవరితోనూ త్వరగా క్లోజ్‌ అవ్వలేను. కానీ, రష్మిక తక్కువ సమయంలోనే దగ్గరైంది. మేమిద్దరం మీమ్స్‌ పంపించుకుంటూ ఉంటాం. ‘కిస్సిక్‌’కు మీరంతా రీల్స్‌ చేయండి. వాటిని చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నా. అల్లు అర్జున్‌తో డ్యాన్స్‌ కాబట్టి ఎంతో ప్రాక్టీస్‌ చేశా. కానీ, ఆయనేమో.. నేను అల్లు అర్జున్‌లా ఇక్కడ డ్యాన్స్‌ చేయట్లేదు, పుష్పలా చేస్తున్నా అనగానే ఆశ్చర్యపోయా. పాత్రలో ఎంతగా ఒదిగిపోయారో అర్థమైంది’’ అని హీరోను శ్రీలీల అన్నారు.

Also Read : Dhanush-Simbu : ఒకే ఫ్రేమ్ లో తమిళ హీరోలు ధనుష్, శింబు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com