Allu Arjun: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… ఇప్పుడు ఏం చేసినా సంచలనంగా మారుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన మామయ్య, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ వేదిగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన అల్లు అర్జున్… తన స్నేహితుడు, నంధ్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్లి స్వయంగా తన మద్దత్తు ప్రకటించడంపై అటు మెగా ఫ్యామిలీ అభిమానులు… ఇటు అల్లు అర్జున్(Allu Arjun) ఆర్మీ… సోషల్ మీడియా వేదికగా కత్తులు దూసుకుంటున్నారు. దీనికి ఆధ్యంపోస్తూ నాగబాబు చేసిన ట్వీట్… ఏపీ రాజకీయాలతో పాటు మెగా,అల్లు ఫ్యామిలీల్లో అగ్గి రాజేసింది. అయితే ఈ విషయం సద్దుమణిగి ఓ కొలిక్కి వస్తున్న సమయంలో అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.
Allu Arjun…
తన స్నేహితుడు శిల్పా రవించద్రరెడ్డి కి మద్దత్తు తెలిపిన బన్నీ(Allu Arjun) దంపతులు… తిరుగు ప్రయాణంలో ఓ దాబాలో సింపుల్ గా భోజనం చేస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఓ పాన్ ఇండియా స్టార్ ఇలా భార్యతో కలిసి, ఓ సాధారణ దాబాలో భోజనం చేయడం బన్నీ సింప్లిసిటీకు నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలు దాబాలో భోజనం చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోస్ చూసిన ఫాన్స్ లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘పాన్ ఇండియా స్టార్ అయ్యుండి.. సింపుల్‌గా దాబాలో భోజనం చేయడం గ్రేట్’, ‘అది మరి బన్నీ అన్న సింప్లిసిటీ’, ‘అల్లు అర్జున్ బ్రో.. నువ్ సూపర్’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
స్టార్ డమ్ రాకముందు ఎంత సింప్లిసిటీగా… వచ్చిన తరువాత దానిని మెయింటెన్ చేయడం చాలా కష్టం. దీనికి కారణం ఫోటోలు, సెల్ఫీల కోసం ఎగబడే అభిమానులు. కాని వీటికి అతీతంగా అల్లు అర్జున్… ఇలా సింపుల్ గా దాబాలో భోజనం చేయడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పుష్ప షూటింగ్ సమయంలో కూడా మారేడుమిల్లిలో ఓ రోడ్డు సైడ్ టిఫిన్ షాపులో బన్నీ టిఫిన్ చేసిన విషయాన్ని మరోసారి అభిమానులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. ‘పుష్ప 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల ముందు తొలి లిరికల్ సాంగ్ రిలీజ్ కాగా, బన్నీ స్టైల్-స్టెప్పులతో ఆకట్టుకుంటోంది.
Also Read : Sudheer Babu: ‘హరోం హర’ వాయిదాపై సుధీర్ బాబు ఎమోషన్ పోస్ట్ !