Allu Arjun : పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా మారి పోయిన ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరోసారి సంచలనంగా మారాడు. సుకుమార్ తీసిన ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది. సీక్వెల్ గా వచ్చిన పుష్ప2 ఏకంగా ఇండియన్ సినీ హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. దీనిని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఎక్స్ వేదికగా ఏకంగా రూ. 1867 కోట్లు వసూలు చేసిందని ప్రకటించారు. దీంతో సినీ వర్గాలు విస్తు పోయాయి. ఆ తర్వాత బన్నీ ఏ సినిమా చేస్తాడనే దానిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
Allu Arjun-Atlee Movie Budget
ఉత్కంఠకు తెర దించుతూ ఇంటర్నేషనల్ లెవల్లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిని భారత దేశంలో భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించే సన్ పిక్చర్స్ నిర్మిస్తుండడం విశేషం. తమిళంలో సూపర్ ఇమేజ్ కలిగిన దర్శకుడు అట్లీ కుమార్(Atlee Kumar) దర్శకత్వం వహిస్తుండడంతో అంచనాలు మరింత పెంచేలా చేశాయి. ఇది పూర్తిగా హాలీవుడ్ ను తలపింప చేసే స్థాయిలో ఉంటుందని ప్రకటించాడు. ఇందుకు సంబంధించి వీడియోను కూడా విడుదల చేశారు.
అయితే బన్నీ, అట్లీ , సన్ పిక్చర్స్ లో రూపుదిద్దుకునే ఈ సినిమాకు ఏకంగా నిర్మాణ సంస్థ రూ. 700 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇందులో హీరో ఒక్కడే రూ. 160 కోట్లకు పైగా తీసుకుంటున్నాడని, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన అట్లీ కుమార్ రూ. 100 కోట్ల కంటే ఎక్కువ డిమాండ్ చేశాడని పరిశ్రమలో టాక్. ఇందుకు సన్ పిక్చర్స్ యజమాని దయానిధి మారన్ ఓకే చెప్పినట్లు సమాచారం. మొత్తంగా ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డుల మోత మోగిస్తోంది బన్నీ, అట్లీ కాంబో.
Also Read : Hero Pawan Kalyan-HHVM :మే 9న పవర్ స్టార్ మూవీ పక్కా