Arya 2 : సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ఆర్య. దీనికి సీక్వెల్ గా ఆర్య2 వచ్చింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోలు నటించిన టాప్ మూవీస్ ను తిరిగి రీ రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని మూవీస్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా బన్నీ ఆర్య2(Arya 2) మూవీని రీ రిలీజ్ చేశారు. ఎవరూ ఊహంచని విధంగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు.
Hero Bunny – Arya 2 Re-release Trending Collections
సినీ వర్గాలు విస్తు పోయేలా ఆర్య 2 అద్భుతమైన కలెక్షన్స్ సాధించడంతో ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ మూవీ ఏకంగా రూ. 6.5 కోట్లు వసూలు చేసింది. ఇదే మూవీ 2009 సంవత్సరంలో విడుదలైంది. ఆనాడు ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ పూర్తిగా నెగటివ్ రోల్ లో నటించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. పాటలు మంచి హిట్ అయ్యాయి. ఆర్య సూపర్ హిట్ అయ్యింది. కానీ సీక్వెల్ గా తీసిన ఆర్య 2 అంతగా పాపులర్ కాలేదు. అయినా మూవీ మేకర్స్ ధైర్యం చేసి రీ రిలీజ్ చేశారు.
వారి పంట పండింది. కాసుల వర్షం కురిపించేలా చేసింది ఆర్య2. మరో వైపు సనమ్ తేరీ కసమ్ కూడా ఇలాంటి అనుభవాన్ని చవి చూసింది. మొదటగా థియేటర్లలో రిలీజ్ కాగా ఆకట్టుకోలేక పోయింది. కానీ ఊహించని విధంగా రీ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు రాగా సినిమాను పెద్ద ఎత్తున ఆదరించారు. బిగ్ హిట్ చేశారు. ఏది ఏమైనా ఎవరు ఎప్పుడు ఎలా ఆదరిస్తారనేది చెప్పలేం. మొత్తంగా ఆర్య 2 ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తుందో వేచి చూడాలి. ఐకాన్ స్టార్ కు ఉన్న ఇమేజ్ ఈ సినిమాకు అస్సెట్ అయిందని చెప్పక తప్పదు.
Also Read : Hero Ram Charan-Campa :కాంపా బ్రాండ్ అంబాసిడర్ గా చెర్రీ