Arya 2 : ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓ సెన్సేషన్. తను ఏది చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఈ నటుడి గురించి కీలక అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం సినీ వర్గాలలో చర్చకు దారి తీసింది. ఈ మధ్యన సినీ రంగానికి సంబంధించి కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. ఆయా నటీ నటులకు సంబంధించి తమ సినీ కెరీర్ లో బిగ్ హిట్ అయిన మూవీస్ ను తిరిగి విడుదల చేయడం. దీంతో ఇప్పుడు అందరి కళ్లు బన్నీపై పడ్డాయి. ఇటీవలే రామ్ చరణ్ తన పుట్టిన రోజు సందర్బంగా ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ చేశారు.
Arya 2 Re-release
ఇక అల్లు అర్జున్(Hero Bunny) పుట్టిన రోజు వచ్చే నెలలో ఉండడంతో మూవీ మేకర్స్ బిగ్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో విషయం తెలిసిన బన్నీ అభిమానులు తెగ సంతోషానికి లోనవుతున్నారు. సామాజిక మాధ్యమాలలో ఇప్పటి నుంచే హోరెత్తిస్తున్నారు. మరోసారి మావోడికి తిరుగే లేదంటున్నారు. ఇదిలా ఉండగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ఆర్య. ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సాహిత్య పరంగా పాటలు, అల్లు అర్జున్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత ఆర్య హిట్ కావడంతో కొన్నాళ్ల తర్వాత ఇదే బన్నీతో కలిసి సీక్వెల్ గా ఆర్య2(Arya 2) తీశాడు. ఇది కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఇందులో అల్లు అర్జున్ డిఫరెంట్ క్యారెక్టర్ పోషించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషించింది. కాగా ఆర్య2లో బన్నీ నెగటివ్ పాత్ర లో కనిపించాడు. మొత్తంగా వచ్చే నెల ఏప్రిల్ 8న ఆర్య2 రీ రిలీజ్ చేయనున్నట్లు కన్ ఫర్మ్ చేశారు. ఇక ప్రస్తుతం బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. దర్శకులను లైన్ లో పెట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ కుమార్ తో మూవీస్ చేయబోతున్నాడని టాక్.
Also Read : Hero Suriya-Retro Movie :రెట్రో వైరల్ ‘కనిమా’ సాంగ్ హల్ చల్