సుకుమార్ తీసిన పుష్ప ది రైజ్ మూవీ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఈ చిత్రం గతంలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. ఇక డైలాగులు , ఉద్వేగ భరితమైన సన్నివేశాలు, పాటలు, ప్రత్యేకించి ప్రధాన పాత్రలో నటించిన అల్లు అర్జున్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. ఏకంగా తొలిసారిగా తెలుగు సినిమా చరిత్రలోనే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నాడు.
తాజాగా ఢిల్లీలో జరిగిన జాతీయ పురస్కారాల ప్రధానోత్సవంలో తళుక్కున మెరిశాడు. పుష్ప రాజ్ తో బాలీవుడ్ ముద్దుగుమ్మలు కృతీ సనన్, అలియా భట్ కలిసి సెల్ఫీ దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. తనకు దక్కిన గౌరవం యావత్ తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. తనకు మంచి పాత్రను ఇచ్చినందుకు దర్శకుడు సుకుమార్ కు థ్యాంక్స్ చెప్పాడు.
ఇఇలా ఉండగా పుష్ప సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్ గా పుష్ప -2 తీస్తున్నాడు డైరెక్టర్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ ధరకు రైట్స్ రిలీజ్ కాకుండా నే అమ్ముడు పోయినట్లు టాక్.