Allari Naresh : ఊర మాస్ లుక్ లో వైరల్ అవుతున్న అల్లరి నరేష్ ‘బచ్చలమల్లి’ పోస్టర్

‘బచ్చలమల్లి’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ బయటకు రాగానే సినిమాపై ఆసక్తి మొదలైంది...

Hello Telugu - Allari Naresh

Allari Naresh : ఇప్పటి రోజుల్లో సినిమా తీయడం సులభమే.. కానీ మార్కెట్‌ చేయడం, అమ్మడం నిర్మాతలకు పెద్ద టాస్క్‌గా మారింది. శాటిలైట్‌, ఓటీటీ హక్కులు అంత త్వరగా అమ్ముడుపోవడం లేదు. విడుదలకు ముందు సినిమా అమ్మేసి, నిర్మాత సేఫ్‌అయిపోవడం కంటే గొప్ప అదృష్టం, అంతకు మించిన విజయం లేదు. మరీ ముఖ్యంగా మధ్య తరగతి సినిమాలకు ఇది చాలా ముఖ్యం. ఈ విషయంలో.. ‘బచ్చలమల్లి’దే అదృష్టం. అల్లరి నరేష్‌(Allari Naresh) కథానాయకుడిగా నటించిన చిత్రమిది. డిసెంబర్ 20న విడుదల చేయాలనుకుంటున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా సేప్‌ జోన్‌లోకి వచ్చేసింది. ఓటీటీ, థియేట్రికల్‌, శాటిలైట్‌, ఆడియో, ఇలా అన్ని రైట్స్‌ అమ్మేశారు. దాదాపు రూ.15 కోట్లతో పూర్తయిన సినిమా ఇది. రైట్స్‌ అన్నీ కలుపుకొంటే రూ.16 కోట్లు వచ్చాయి. అంటే విడుదలకు ముందే నిర్మాత టేబుల్‌ ప్రాఫిట్‌ అన్నమాట.

Allari Naresh Movies..

‘బచ్చలమల్లి’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ బయటకు రాగానే సినిమాపై ఆసక్తి మొదలైంది. నరేష్‌ కొత్త గెటప్‌లో కనిపించారు. ఆ గెటప్‌లో ఆయన్ని ఎప్పటిదాకా చూడలేదు. ఈ సినిమానే తీసిన హాస్య మూవీస్‌ సంస్థ నుంచి వరుసగా మంచి సినిమాలే వస్తున్నాయి. నిర్మాత రాజేష్‌ దండా కూడా కథల్ని ఆచితూచి ఎంచుకొంటున్నారు. నాంది, సామజవరగమన, ఊరి పేరు భైరవకోన, ‘ఇట్లు మారేడుమిల్లి నియోజక వర్గం’ ఇలా అన్నీ డీసెంట్‌ సినిమాలే చేశారు. అందుకే.. ‘బచ్చలమల్లి’ కి మంచి మార్కెట్‌ వచ్చింది. డిసెంబర్ 20 కూడా మంచి డేటే. ఆ రోజున ‘గేమ్‌ ఛేంజర్‌’ రావాల్సివుంది. అది వాయిదా పడడంతో స్లాట్‌ ఖాళీగా దొరికింది. దాంతో ప్రమోషన్స్‌ వేగం పెంచాలని నిర్మాత భావిస్తున్నారు.

Also Read : Dhanush-Aishwarya : చివరకు విడిపోవాలని నిర్ణయించుకున్న ఆ జంట

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com