Allari Naresh: టాలీవుడ్ లో బయోపిక్ వెల్లువ కొనసాగుతోంది. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తో ఇటీవల ప్రేక్షకులకు ముందుకు వచ్చారు మాస్ మహారాజ్ రవితేజ. డిసెంబరు 2న ప్రముఖ నటి సిల్క్ స్మిత పుట్టిన రోజు సందర్భంగా… ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘సిల్క్ స్మిత ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో రెండో బయోపిక్ తీస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజా ఈ జాబితాలో అల్లరి నరేష్ చేరారు.
Allari Naresh – తుని ప్రాంతంలో గజదొంగ ‘బచ్చలమల్లి’
‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్ర దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో ఇటీవల ఆయన ప్రారంభించిన సినిమాకు ‘బచ్చలమల్లి’ అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ లుక్ విడుదల చేసారు. దీనితో ఈ ‘బచ్చలమల్లి’ అంటే ఎవరు అని ఆరాతీసిన వారికి తూర్పు గోదావరి జిల్లాలోని తుని ప్రాంతానికి చెందిన గజ దొంగ అని తెలిసింది. దీనితో ‘బచ్చలమల్లి’ అనే గజదొంగ కమ్ రౌడీ కథను సీరియస్ గా చెప్తూనే కామెడీ పండించడానికి అల్లరి నరేష్ సిద్ధమయ్యారని చిత్ర వర్గాలు చర్చించుకుంటున్నాయి.
నాంది, ఇట్లు మారేడుమిల్లి, ఉగ్రం తరువాత ‘బచ్చలమల్లి’
విభిన్నమైన కథలతో ఆడియన్స్ కు దగ్గరవుతున్నారు హీరో అల్లరి నరేష్(Allari Naresh). అల్లరి నరేష్ గతంలో ఓన్లీ కామెడీ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ… ప్రస్తుతం కామెడీ కంటెంట్ తో పాటు సీరియస్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి’, ‘ఉగ్రం’తో వరుస బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ త్వరలో ‘బచ్చలమల్లి’ వస్తున్నారు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ని నిర్మించిన హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అంతిస్తున్నారు.
Also Read : Captain Vijayakanth: విజయకాంత్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన నాజర్