బాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. ఆమె ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ ముద్దుల కూతురు. కథ ప్రాధాన్యత కలిగి ఉన్న సినిమాలకే ఓకే చెబుతోంది.
ఆమె తాజాగా నటించిన గంగూభయ్ కతియావాది చిత్రం జాతీయ స్థాయిలో అవార్డు పొందింది. ఇందులో నటనా పరంగా వంద మార్కులు కొట్టేసింది. తాజాగా ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడింది ఈ అందాల ముద్దుగుమ్మ.
తన తండ్రి మహేష్ భట్ గొప్ప దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఎన్నో సినిమాలు తీశాడు. కొన్ని సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత తీసిన మూవీస్ పరాజయం పాలయ్యాయి. ఆ సమయంలో మేం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒకానొక దశలో నెల గడిచేందుకు కూడా ఇబ్బందిగా ఉండేది.
కానీ తన తప్పు తెలుసుకున్నారు మా నాన్న. పూర్తిగా మద్యం మహమ్మారి నుంచి బయట పడ్డాడు. మంచి సినిమాలు తీశాడు. మళ్లీ మేం కోలుకున్నాం. సినిమా అన్నది సక్సెస్ ఉన్నప్పుడే పలకరిస్తుంది. ఆ తర్వాత పట్టించుకోదు. ఈ విషయం మా నాన్న విషయంలో తనకు అర్థమైందని చెప్పింది అలియా భట్.
మొత్తంగా తను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారాయి.