Alia Bhatt : సృజనాత్మకత కలిగిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన గంగూబాయి కథియావాడి చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రముఖ నటి ఆలియా భట్(Alia Bhatt). తను ఇందులో గంగూబాయిగా నటించింది. ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. తన జీవితంలో మరిచి పోలేని పాత్ర, సినిమా ఏదైనా ఉందంటే అది గంగూబాయి కథియావాడి మాత్రమేనని స్పష్టం చేసింది. ఇది దేవుడు తనకు సంజయ్ లీలా భన్సాలీ రూపంలో ఇచ్చాడని తెలిపింది.
Alia Bhatt Comment
ఈ సినిమా వచ్చి మూడు ఏళ్లయిందంటే తాను నమ్మలేక పోతున్నానంటూ పేర్కొంది. ఈ చిత్రం ఫిబ్రవరి 25, 2022న విడుదలైంది. అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలు అవార్డులు, పురస్కారాలను స్వంతం చేసుకుంది.
ఎస్. హుస్సేన్ జైది రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకంలోని కథనే గంగూబాయి కథియావాడి. ఒక సాధారణ అమ్మాయి కథను చెబుతుంది. ఆమె బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టబడుతుంది. ఆ తర్వాత బొంబాయి రెడ్ లైట్ ఏరియాకు శక్తివంతమైన నాయకురాలిగా ఎదుగుతుంది. ఇదే సినిమా కథ. ఇందులో అద్బుతంగా నటించింది ఆలియా భట్.
Also Read : Shreya Ghoshal Shocking :అలాంటి పాటల వల్ల ఇబ్బంది పడ్డా