Alia Bhatt Gangubahi : నటనే రాదన్నారు. అసలు ఏ పాత్రకు సరి పోదన్నారు. కానీ తనను విమర్శించిన వాళ్లు చప్పట్లు కొట్టేలా తనను తాను గొప్ప నటిగా ప్రూవ్ చేసుకుంది అలియా భట్. టేకింగ్ లోనే కాదు మేకింగ్ లోనూ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ అలియాను కావాలని ఎంపిక చేసుకున్నాడు.
Alia Bhatt Gangubahi Got National Award
ఆయన ఎంచుకున్న కథ భిన్నమైనది. తాను దర్శకత్వం వహించిన గంగూబాయి కాఠియావాడి చిత్రం సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది అలియా భట్(Alia Bhatt). వేశ్యగా జీవితాన్ని ప్రాంరభించింది గంగూబాయి.
ఆ తర్వాత కామాటిపురకు నాయకురాలిగా ఎలా ఎదిగింది..ఎన్ని కష్టాలను అధిగమించింది. ఎన్ని అవరోధాలను దాటుకుని నిలబడ్డది, ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నాలుగు వేల మంది మహిళల హక్కుల కోసం అలియా భట్ చేసిన పోరాటం ఏమిటి అన్నదే గంగూబాయి కాఠియా వాడి సినిమా.
ఆద్యంతమూ ప్రశ్నించడమే కాదు నిలదీసి నిగ్గదీసి ఆక్రోశాన్ని ప్రకటించడం కూడా ఇందులో తనను తాను లీనమై పోయి నటించింది అలియా భట్. అందుకే జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది.
Also Read : Chandrabose : చంద్రబోస్ హ్యాట్సాఫ్