Polimera 2: క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీగా తెరకెక్కి ఓటీటీలో రిలీజై పొలిమేర ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే. దీంతో దీనికి సీక్వెల్‌గా గీత ఆర్ట్స్ బ్యానర్ పై పొలిమేర2ని థియేటర్లలోకి తీసుకొచ్చారు.
దీంతో ఈ మూవీ ఎవరూ ఊహించని విధంగా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ అందుకొని, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఇలాంటిబ్లాక్ బస్టర్ సినిమా ఆఫర్‌ను ఓ స్టార్ కమెడియన్ మిస్ చేసుకున్నాడంట.
Polimera 2 :
ఇంతకీ అతను ఎవరూ అనుకుంటున్నారా? పొలిమేర 2 (polimera 2) సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను తదితరులు నటించి మంచి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే సత్యం రాజేశ్ స్థానంలో మొదటి ఛాయిస్‌గా ఆలీని అనుకున్నారంట. కాన్సెప్ట్‌ను ఆలీకి చెప్పడంతో, ఆయనకు కూడా నచ్చడంతో తాను ఈ ప్రాజెక్ట్‌కు ఒకే చెప్పాడంట. కానీ అదే సమయంలో వేరే ప్రాజెక్ట్‌తో ఆలీ బిజీగా ఉంటడంతో సత్యం రాజేశ్ చేతికి ఈ అవకాశం వెళ్లిందంట. ఇలా సత్యం రాజేశ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
Also Read : Apple : ఆపిల్‌తో పాటు గింజలు తింటున్నారా?