సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ గా, యూట్యూబర్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గుర్తింపు పొందిన దేత్తడి అలేఖ్య హారిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. తెలంగాణ యాసతో ఫుల్ జోష్ నింపుతూ హుషారు ఎక్కించేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
వరుడు కావలెను మూవీలో చిన్న పాత్రలో నటించింది. కానీ ప్రస్తుతం ఓ అప్ డేట్ వచ్చింది. తను నేరుగా హీరోయిన్ గా చేయబోతోందని టాక్. స్వంతంగా హారికకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇరు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సుపరిచుతరాలు.
అయితే దేత్తడి అలేఖ్య హారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందట. యువ హీరో సంతోష్ శోభన్ కథా నాయకుడిగా నటించే సినిమాలో తన సరసన నటించేందుకు ఎంపికైందట. ఈ మూవీకి సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారను. బీబే మేకర్స్ నిర్మాత ఎస్కేఎన్ దీనికి నిర్మాణ సహకారం అందిస్తున్నాడు.
ఇక దర్శకుడు బేబి మూవీలో యూట్యూబర్ గా ఉన్న వైష్ణవి చైతన్యకు అద్భుత ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు అలేఖ్య హారికకు ఇవ్వనుండడం విశేషం.