Akshay Kumar: ప్లేటులో వడ్డించి మరీ అన్నదానం నిర్వహించిన బాలీవుడ్ స్టార్ హీరో !

ప్లేటులో వడ్డించి మరీ అన్నదానం నిర్వహించిన బాలీవుడ్ స్టార్ హీరో !

Hello Telugu - Akshay Kumar

Akshay Kumar: అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. ఒకరి కడుపు నింపితే వచ్చే ఆనందం వెలకట్టలేనిది. అయితే చాలా మంది ముఖ్యంగా సెలబ్రెటీలు అన్నదానం చేయడానికి నిధులు విరాళంగా ఇచ్చినా, స్వంత నిధులతో అన్నదానం ఏర్పాటు చేసినా… సెక్యూరిటీ ఇతరత్రా కారణాల వలన వారు నేరుగా అన్నదానం కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నారు. ఏదో ఫోటోల కోసం ఒకరిద్దరికి భోజనం వడ్డించడం లేదా… వడ్డించడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని పరిశీలించడంతో సరిపెడతారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం… అన్నదానం కార్యక్రమాన్ని ఆయనే స్వయంగా నిర్వహించారు.

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌(Akshay Kumar) ముంబైలోని తన ఇంటి ఆవరణలో అన్నదానం చేసి మంచి మనసు చాటుకున్నాడు. ముఖానికి మాస్కు ధరించిన ఆయన పలువురికీ ప్లేటులో స్వయంగా భోజనం వడ్డించి ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అక్షయ్‌ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అక్కి అన్న.. నువ్వు మా మనసులు గెలుచుకున్నావ్‌, నీది ఎంత మంచి మనసో అని కామెంట్లు చేస్తున్నారు.

Akshay Kumar – వరుస ఫ్లాప్స్… ఖేల్‌ ఖేల్‌ మే పైనే ఆశలు !

అక్షయ్‌ కుమార్‌ కు కరోనా సోకగా ఇటీవలే దాని నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఈయన ప్రధాన పాత్రలో నటించిన ఖేల్‌ ఖేల్‌ మే సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఇందులో వాణి కపూర్‌, తాప్సీ, అమ్మీ విర్క్‌, ఫర్దీన్‌ ఖాన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది అక్షయ్‌.. బడే మియా చోటే మియా, సర్ఫిరా చిత్రాలతో అలరించాడు. అయితే ఈ రెండూ ఫ్లాప్‌ కావడంతో ప్రస్తుతం అతడు ఖేల్‌ ఖేల్‌ మే సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

Also Read : Suma Kanakala: అనుకోని వివాదంలో చిక్కుకున్న యాంకర్ సుమ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com