Akshay Kumar Praise : అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ వరల్డ్ వైడ్ గా దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలై బాక్సులు బద్దలు కొడుతోంది. ఇప్పటి వరకు రూ. 350 కోట్లను దాటేసింది. ఈ సందర్భంగా చిత్రంలో అద్భుతంగా నటించి మెప్పించిన బాద్ షా షారుక్ ఖాన్ , నయన తార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతిలను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు నటీనటులు.
Akshay Kumar Praise to Shah Rukh Khan
షారుక్ ఖాన్ నటన పీక్ స్టేజ్ లో ఉందని కితాబు ఇచ్చాడు ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar). కింగ్ ఖాన్ కు ఇక తిరుగు లేదన్నాడు. తనకు ఈ ఏడాది అద్భుతమైన సక్సెస్ లభించిందని పేర్కొన్నాడు. సోషల్ మీడియా వేదికగా తన సహచర నటుడు బాద్ షాను ప్రశసంలతో ముంచెత్తాడు.
ఇప్పటికే షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సక్సెస్ అయ్యింది. తన సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ఫిలింగా నిలిచి పోయింది. ఏకంగా రూ. 1,000 కోట్లు కొల్లగొట్టింది. తాజాగా అట్లీ తీసిన జవాన్ పఠాన్ ను ఓవర్ టేక్ చేసేందుకు పరుగులు తీస్తోంది. వరల్డ్ వైడ్ గా అద్భుతమైన టాక్ వచ్చింది ఈ చిత్రానికి. ప్రత్యేకించి బాద్ షా నటనకు అంతా ఫిదా అయ్యారు.
షారుక్ ఖాన్ కు పోటా పోటీగా నటించి మెప్పించింది ఇద్దరు పిల్లలు కలిగిన తల్లి అయిన నయన తార. ఎక్కడా రాజీ పడకుండా వంద శాతం న్యాయం చేసింది. మొత్తంగా ఈ చిత్రం క్రెడిట్ మాత్రం డైరెక్టర్ అట్లీదేనని అంటున్నాడు కింద్ బాద్ షా.
Also Read : AR Rahman : సంగీత కచేరి ఘటన రెహమాన్ స్పందన