Akshay Kumar: ‘కన్నప్ప’ షూటింగ్ పూర్తి చేసిన అక్షయ్‌ కుమార్ !

‘కన్నప్ప’ షూటింగ్ పూర్తి చేసిన అక్షయ్‌ కుమార్ !

Hello Telugu - Akshay Kumar

Akshay Kumar:నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో మంచు కుటుంబం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌, మోహన్ బాబు, మోహన్‌లాల్, శరత్ కుమార్, శివరాజ్‌కుమార్‌ లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌ కీచా ఖామ్‌ఫక్డీ రంగంలోనికి దించారు. మంచు కుటుంబం అతి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా…. ఎక్కువ భాగం న్యూజీలాండ్ లో షూటింగ్ చేస్తున్నారు. చివరి దశ షూటింగ్ కు చేరుకున్న ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

Akshay Kumar:

‘కన్నప్ప’ సినిమా షూటింగ్‌ కోసం వచ్చిన బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌(Akshay Kumar) తన సన్నివేశాలకు సంబంధించిన వర్క్‌ పూర్తి చేశారు. ‘అక్షయ్‌ కుమార్‌ తో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది. ఇలా ఇంకా ఎన్నోసార్లు కలవాలని కోరుకుంటున్నా’ అని ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఈ మేరకు అక్షయ్‌తో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసారు మంచు విష్ణు. ప్రస్తుతం విష్ణు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Also Read:Nayanthara: ‘కేజీఎఫ్’ యశ్ సినిమాలో నయనతార ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com