Nagarjuna : టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక రంగం కోసం చేస్తున్న ప్రయత్నం బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు తాను కూడా తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఈ మేరకు నాగార్జున(Nagarjuna) స్వయంగా వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hero Nagarjuna Comment
తెలంగాణ టూరిజం అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు అక్కినేని నాగార్జున. పర్యాటక పరంగా ఎన్నో ప్రసిద్ద క్షేత్రాలు, పుణ్య స్థలాలు, ఎకో పార్కులు, ప్రాజెక్టులు, అటవీ ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. వీటిని కాపాడు కోవాలని సూచించారు.
ఆలంపూరంలోని జోగులాంబ, యాదగిరిగట్టలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన బుద్ద వనం, ప్రపంచంలోనే అతి పెద్ద జల ప్రాజెక్టుగా పేరు పొందిన కాళేశ్వరం , వేములాడ రాజన్న, కొండగట్టు అంజన్నతో పాటు శంషాబాద్ వద్ద ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన రామానుజాచార్య విగ్రహం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు అక్కినేని నాగార్జున.
అందమైన హైదరాబాద్ నగరం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. చార్మినార్, బిర్లా మందిర్, అంబేద్కర్ , నెక్లస్ రోడ్ , చౌమహల్లా ప్యాలస్ చూసి తీరాల్సిందేనని పేర్కొన్నారు.
Also Read : Jayachandran Death : ప్రముఖ గాయకుడు జయచంద్రన్ కన్నుమూత