Zulfi Ravdjee : అఖిల్ అక్కినేని నిశ్చితార్థం గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అఖిల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జైనాబ్ రావుద్జీ గురించి నెటిజన్లు ఆసక్తిగా మాట్లాడటం ప్రారంభించారు. ఈ సందర్భంగా జైనాబ్ తండ్రి జుల్ఫీ రావుద్జీ గురించి ఆసక్తికరమైన వివరాలు బయటపడ్డాయి.
Zulfi Ravdjee..
జుల్ఫీ రావుద్జీ(Zulfi Ravdjee) గల్ఫ్ దేశాల్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ టాయకూన్ గా పేరు పొందిన వ్యక్తి. ఆయన వేల కోట్ల ఆస్తి కలిగిన కుబేరుడు. రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న జుల్ఫీ రావుద్జీ, తన వ్యాపార సామ్రాజ్యాన్ని గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తరువాత, జుల్ఫీ రావుద్జీ ఏపీ గవర్నమెంట్ సలహాదారుగా కూడా పనిచేశారు. ఆయన ప్రత్యేక ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. జుల్ఫీ రావుద్జీ కుమారుడు జైన్ రావుద్జీ ప్రస్తుతం ZR Renewable Energy Pvt Ltd అనే సంస్థకు చైర్మన్ మరియు ఎండీగా పని చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో నివసించే జుల్ఫీ రావుద్జీ కుటుంబం, ఏపీ ప్రభుత్వ నుంచి అనేక ప్రత్యేక సౌకర్యాలు పొందింది. ప్రభుత్వ స్థాయిలో కారు, ల్యాప్‌టాప్, ఫర్నిచర్, అలాగే ఇతర విలువైన సౌకర్యాలు అందించారు. వీటితో పాటు, ఆయనకు ప్రైవేట్ సెక్రటరీ, అదనపు ప్రైవేట్ సెక్రటరీ, జమేదార్, డ్రైవర్లు వంటి ఉద్యోగులను కూడా నియమించారు. ఈ మొత్తం పరిణామం, జైనాబ్ రావుద్జీ కుటుంబం వెలుగు చూసే విషయం మాత్రమే కాకుండా, అఖిల్ అక్కినేని కుటుంబానికి కూడా రాజకీయ, ఆర్థికంగా ఎంతో గౌరవాన్ని అందిస్తుంది.
Also Read : Ram Gopal Varma : పోలీస్ ఇన్వెస్టిగేషన్ పై మరోసారి స్పందించిన ‘రామ్ గోపాల్ వర్మ’