Akhil : టాలీవుడ్ లో అత్యంత జనాదరణ కలిగిన నటుడు అక్కినేని నాగార్జున. నటుడిగా, హోస్ట్ గా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాదు ఎవరూ ఊహించని రీతిలో వ్యాపారం కూడా చేస్తున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దే పనిలో ఉన్నాడు. ఇటీవలే మనీ కంట్రోల్ సంస్థ సంచలన ప్రకటన చేసింది. దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన నటుల జాబితాను వెల్లడించింది.
Akhil-Zainab Marriage Updates
ఏకంగా దక్షిణాదిలోనే నాగార్జున ఫ్యామిలీ నిలిచింది. తన నికర ఆస్తుల విలువ వేల కోట్లను దాటేసిందని తెలిపింది. ఇది పక్కన పెడితే తనకు ఇద్దరు కొడుకులు . ఒకరు నాగ చైతన్య కాగా ఇటీవలే తను శోభిత ధూళిపాళను చేసుకున్నాడు. అంతకు ముందు సమంత రుత్ ప్రభుకు విడాకులు ఇచ్చేశాడు.
ఇదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో చిన్నోడు అఖిల్(Akhil) అక్కినేని అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ తను కూడా లవ్ లో పడ్డానంటూ ప్రకటించాడు. ఆపై ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అయిన జైనాబ్ రవిడ్జీతో నిశ్చితార్థం కూడా అయి పోయింది. తాజాగా ఈ ఇద్దరు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తళుక్కున మెరిశారు. ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున పెళ్లి ఏర్పాట్లలో మునిగి పోయింది నాగ్ కుటుంబం. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సెలిబ్రిటీలు, క్రికెటర్లు, ఇతర ఆటగాళ్లు, పొలిటికల్ లీడర్లను కూడా పిలిచే ఛాన్స్ ఉంది.
ఇటీవలే నాగార్జున ఫ్యామిలీ పీఎం మోదీని కలుసుకున్నారు కూడా. తాజాగా అఖిల్, జైనాబ్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే మార్చి 24న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు టాక్. అఖిల్, నాగ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఈ జంటను చూసేందుకు.
Also Read : YS Jagan Sensational :కూటమి సర్కార్ బేకార్ – వైఎస్ జగన్