Akhil : అఖిల్ అక్కినేని కొత్త చిత్రంపై ఫోకస్ పెట్టారు. సురేందర్ రెడ్డి తీసిన ఏజెంట్ ఆశించిన మేర ఆడలేదు. ఇదే సమయంలో బొమ్మరిల్లు భాస్కర్ తీసిన బ్యాచ్ లర్ చిత్రంలో నటించాడు. ఈ మూవీ బాగానే ఆడింది. ఆ తర్వాత సితార ఎంటర్ టైనర్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నాడు. ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు అఖిల్ అక్కినేని(Akhil). చాలా కాలం తర్వాత సినిమాలో నటిస్తున్నాడు. ఓ వైపు తండ్రి నాగార్జున సైతం ముఖ్య భూమిక పోషిస్తున్నాడు తమిళ సినిమాలో . రజనీకాంత్ తో పాటు నటిస్తుండడం విశేషం. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం కూలీ.
Hero Akhil Akkineni New Role
నిర్మాత నాగవంశీ జోరు మీద ఉన్నాడు. తను తీసిన చిత్రం మ్యాడ్ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆయనతో పాటు అన్నపూర్ణ స్టూడియో కూడా కలిసి నిర్మిస్తోంది. అఖిల్ అక్కినేని పుట్టిన రోజు సందర్బంగా కొత్త చిత్రానికి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. మురళి కిషోర్ అబ్బూరు లెనిన్ సినిమా తీస్తున్నాడు. గతంలో తను కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథకు దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నట్టు టాక్. అఖిల్ అక్కినేనికి ప్రస్తుతం సినిమా సక్సెస్ కావాల్సి ఉంటుంది. అందుకే మంచి కసితో తీస్తున్నాడు దర్శకుడు. ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తోంది లవ్లీ బ్యూటీ శ్రీలీల. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పండడం ఖాయమని అంటున్నారు సినీ క్రిటిక్స్. ఇందులో నటి అఖిల్ వైపు చూస్తూ నవ్వుతున్న సీన్ ఆకట్టుకునేలా ఉంది. సినిమా రిలీజ్ అయ్యాక ఏ మేరకు రాణిస్తుందనేది ప్రేక్షకులు చెప్పాల్సి ఉంటుంది.
Also Read : Hero Chiranjeevi-Jakkanna :జక్కన్నతో మూవీ చేయాలంటే టైం కావాలి