Akhil Akkineni : ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ హీరో అఖిల్ అక్కినేని(Akhil Akkineni) కెరీర్ పరంగా మరింత దూకుడు పెంచాడు. వరుస సినిమాలకు ఓకే చెబుతూ సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. తను ఆ మధ్యన బొమ్మరిల్లు భాస్కర్ తో బ్యాచ్ లర్ మూవీలో నటించాడు. ఆ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే తళుక్కున మెరిసింది. అంతకు ముందు డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఏజెంట్ లో నటించాడు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోలు తాము నటించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా చేస్తున్నారు. తాజాగా మనోడు నటించిన ఏజెంట్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది.
Akhil Akkineni Movie Updates
ప్రస్తుతం అఖిల్ అక్కినేనికి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఓ నూతన డైరెక్టర్ కథ చెప్పాడని , దానికి ఓకే చేశాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. తను ఎవరో కాదు హిట్ మూవీ సామజవరగమన మూవీ సహ రచయిత నందు. తను చెప్పిన కథ నచ్చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు టాక్. ప్రస్తుతం తను వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరుతో ఓ సినిమా చేస్తున్నాడు. మరో వైపు ఇప్పటికే పీరియాడికల్ మూవీకి కూడా ఓకే చెప్పాడు. దీనిని నూతన దర్శకుడు అనిల్ తీయబోతున్నాడు.
ఇక నందుతో తీయబోయే మూవీ ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సినీ వర్గాల భోగట్టా. ఇక షూటింగ్ విషయానికి వస్తే మురళీ కిషోర్ దర్శకత్వంలో అఖిల్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో లవ్లీ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా అఖిల్ అక్కినేని సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read : Beauty Ketika-Warner :కేతికా శర్మ..డేవిడ్ వార్నర్ డ్యాన్స్ అదుర్స్