Akhanda2 : డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరోసారి మ్యాజిక్ చేసేందుకు వస్తున్నాడు నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna). తను నటించిన అఖండ అనూహ్య విజయాన్ని అందుకుంది. తన సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. తాజాగా మినిమం గ్యారెంటీ కలిగిన దర్శకుడిగా పేరు పొందిన బాబీ దర్శకత్వంలో నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైంది. సూపర్ సక్సెస్ ను అందుకుంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకు పోయాడు బాలయ్య.
Akhanda2 Movie Updates
ఇక అఖండ మూవీ దుమ్ము రేపడంతో దానికి కొనసాగింపుగా మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. అఖండ2 చిత్రం అనౌన్స్ చేశారు. ఆల్ రెడీ షూటింగ్ కొనసాగుతోంది శరవేగంగా. ఈ మధ్యనే యూపీ లోని అలహాబాద్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళాలో కొంత చిత్రీకరణ చేశారు డైరెక్టర్ బోయపాటి శ్రీను.
కాగా తాజాగా టాలీవుడ్ లో అఖండ2 మూవీకి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను మహా శివ రాత్రి పర్వదినం సందర్బంగా విడుదల చేయనున్నారని. బాలయ్య శివుడు, నరసింహుడి పాత్రలను అలవోకగా చేస్తాడని పేరుంది. ఇక ఈ సినిమాలో సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడని టాక్ . మరో వైపు సెప్టెంబర్ 25న అఖండ 2 సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించడం విశేషం.
ఆరోజు రిలీజ్ అయ్యే బాలయ్య ఫస్ట్ లుక్ ఎలా ఉండ బోతోందనే ఉత్కంఠ ఫ్యాన్స్ లో నెలకొంది.
Also Read : Udit Narayan – Kissing Master : ఈ సింగర్ కిస్సింగ్ మాస్టర్