Akhanda 2 : దమ్మున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న సీక్వెల్ చిత్రం అఖండ 2 షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అఖండ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ అయ్యింది. భావోద్వేగాలను పలికించడంలో తనకు తనే సాటి బాలకృష్ణ.
Akhanda 2 Movie Updates
ఇదిలా ఉండగా బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది నాలుగోది. కాగా ఈ చిత్రం గురించి కీలకమైన అప్ డేట్ వచ్చింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ కూడా అఖండ2లో నటించనున్నట్లు టాక్. తను మెయిన్ రోల్ లో నటిస్తున్నారు. మెయిన్ విలన్ గా కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం.
మరో వైపు ఆది పినిశెట్టి కూడా బాలయ్యకు పోటీగా నటించనున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. బీటౌన్ లో విలనిజం పండించడంలో సంజయ్ దత్ కు సాటి రారు ఎవ్వరు అంటూ నెటిజన్లు , ఫ్యాన్స్ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇక అఖండ మూవీలో బాలయ్యతో ఢీకొన్న శ్రీకాంత్ స్థానంలో ఆది పినిశెట్టి ఉంటాడని , దీనికి కన్ ఫర్మ్ కూడా దర్శకుడు చేసినట్లు సినీ వర్గాల భోగట్టా.
మొదట ఎప్పటి లాగే అఖండ2 సీక్వెల్ లో ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుందని అనుకున్నారు కానీ ఊహించని రీతిలో మలయాళ కుట్టీ సంయుక్త మీనన్ ను ఎంపిక చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను.
Also Read : Victory Venkatesh Movie :బుల్లి తెరపై సంక్రాంతికి వస్తున్నాం