Akhanda 2: త్వరలో సెట్స్ పైకి అఖండ 2 ?

త్వరలో సెట్స్ పైకి అఖండ 2 ?

Hello Telugu - Akhanda 2

Akhanda 2: బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ కీలక పాత్రల్లో నటించగా… ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత వచ్చిన అఖండ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీనితో అఖండకు సీక్వెల్ గా ‘అఖండ2’ను తెరకెక్కిస్తామని అప్పట్లోనే దర్శకుడు బోయపాటి శ్రీను ప్రకటించారు.

Akhanda 2 Updates

బోయపాటి శ్రీను తాజాగా గీతా ఆర్ట్స్ పతాకంపై ఓ సినిమా రూపొందించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే అందులో హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అల్లు అర్జున్, సూర్యల కోసం కథలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్, సూర్య ఇద్దరూ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దీనితో ఈ గ్యాప్ లో దర్శకుడు బోయపాటి(Boyapati Srinu) ‘అఖండ2’ పై ఫోకస్ పెట్టినట్లు టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో సినిమా గురించి టాలీవుడ్ వర్గాలు ప్రముఖంగా మాట్లాడుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో బోయపాటి తరువాత సినిమా… ‘అఖండ2’ పట్టాలెక్కుతుందా లేక… వేరే కథతో సినిమా చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ‘అఖండ’కి కొనసాగింపు ఉంటుందని ఆ సినిమా విడుదల సమయంలోనే దర్శకుడు బోయపాటి స్పష్టం చేయడంతో… త్వరలో సెట్స్ పైకి వెళ్లబోయేది ‘అఖండ 2’ అనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ కూడా సిద్ధం అయినట్లు బోయపాటి సన్నిహితుల నుండి సమాచారం రావడంతో… సమీకరణలన్నీ కుదిరితే ‘అఖండ 2’ సినిమానే త్వరలో పట్టాలెక్కే అవకాశాలుకనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Also Read : Upasana Konidela: విజయ్ పొలిటికల్‌ ఎంట్రీపై ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com