Akhanda 2 : మరో కొత్త కాన్సెప్ట్ తో పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న అఖండ 2

బోయపాటి డైరక్షన్‌లో బాలయ్య సినిమా చేస్తున్నారంటేనే ఫ్యాన్స్ కి ఫుల్‌ మీల్స్ రెడీ అవుతోందని అర్థం...

Hello Telugu - Akhanda 2

Akhanda 2 : సినిమాల షూటింగ్‌ విషయంలో ఆలస్యం జరుగుతుందంటే బోలెడన్ని కారణాలుంటాయి. హీరో, హీరోయిన్ల కాల్షీట్‌ సర్దుబాటు కాక కావచ్చు… లొకేషన్లు కుదరక కావచ్చు… స్క్రిప్ట్ పక్కాగా కుదరకపోవడం వల్లా కావచ్చు. కానీ అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్‌ చేసుకున్న తర్వాత టోటల్‌ థీమ్‌నే మార్చాల్సి వస్తే… అప్పటిదాకా అనుకున్నదాన్ని ఇంకో రకంగా మార్చుకోవాల్సి వస్తే.. బాలయ్య అండ్‌ పవన్‌… ఒకే రకమైన ఇరకాటంలో పడ్డారా? మాట్లాడుకుందాం పదండి… బాలకృష్ణ రీసెంట్‌ కెరీర్‌లో అందరినీ మెస్మరైజ్‌ చేసిన సినిమాల్లో అఖండ ఒకటి. హిందీ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయింది ఈ సబ్జెక్ట్. అందుకే ఎలాగైనా పార్ట్ 2 సౌండ్‌ని ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో వినిపించాలని కంకణం కట్టుకున్నారు బోయపాటి శ్రీను. బాలయ్య(Balakrishna)- బోయపాటి కాంబినేషన్‌ అనగానే అదోమాదిరి ఇష్టం పెంచుకుంటారు నందమూరి అభిమానులు.

Akhanda 2 Movie Updates

బోయపాటి డైరక్షన్‌లో బాలయ్య సినిమా చేస్తున్నారంటేనే ఫ్యాన్స్ కి ఫుల్‌ మీల్స్ రెడీ అవుతోందని అర్థం. అయితే ఈ సారి మాత్రం వంట దినుసులు మారుతున్నాయన్నది టాక్‌. ఆల్రెడీ యాంటీ గవర్నమెంట్‌ థీమ్‌తో కథను సిద్ధం చేశారట. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. అందుకే థీమ్‌ని కూడా మార్చే పనిలో పడ్డారట బోయపాటి. అందుకే అఖండ 2 సెట్స్ మీదకు వెళ్లడానికి ఆలస్యం అవుతుందన్నది టాక్‌. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ సినిమా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌కి కూడా అఖండ2కి వచ్చిన కష్టాలే వచ్చాయట. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లోనూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు విషయాలను ఇంక్లూడ్‌ చేశారట హరీష్‌ శంకర్‌. ఇప్పుడు వాటన్నిటినీ మార్చాల్సిన సిట్చువేషన్‌లో ఉన్నారట కెప్టెన్‌. వీలైనంత త్వరగా అఖండ2, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కెప్టెన్లు స్క్రిప్టు మార్చి, హీరోలను కన్విన్స్ చేస్తే సినిమాలు సెట్స్ మీదకు వెళ్తాయి. కన్విన్సింగ్‌గా స్క్రిప్ట్ నెరేట్‌ చేసేవరకు ఈ ఆలస్యం తప్పదన్నది ఫిల్మ్ నగర్‌ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌. నిజానిజాలేంటన్నది బోయపాటి, హరీష్‌ శంకర్‌ చెప్పాల్సిందే మరి.

Also Read : Tabu : పారితోషికం వ్యత్యాసంపై కీలక వ్యాఖ్యలు చేసిన టబు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com