Akash Puri : తన పేరు మార్చుకుని ఇకపై ఆ పిలవాలని కోరిన ఆకాష్ పూరి

రొమాంటిక్‌, చోర్‌బజార్‌ అనే సినిమాలు చేశారు ఆకాష్...

Hello Telugu - Akash Puri

Akash Puri : డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు ఆకాష్ పూరి. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువగా ఆకాష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు ఆకాష్. చిరుత, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, బిజినెస్ మేన్,ధోని, గబ్బర్ సింగ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ గా చేశాడు ఆ తర్వాత హీరోగా మారాడు. ఆకాష్(Akash Puri) ముందుగా ఆంధ్రపోరి అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా వచ్చిన విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. ఆతర్వాత వచ్చిన మెహబూబా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడకపోయినా ఆకాష్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.

Akash Puri Comment

రొమాంటిక్‌, చోర్‌బజార్‌ అనే సినిమాలు చేశారు ఆకాష్. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇస్తూ వస్తున్నాడు ఆకాష్. ఇదిలా ఉంటే తాజాగా ఆకాష్ పూరి తన పేరు మార్చుకున్నాడు. ఇక పై తన పేరు ఆకాష్ పూరి కాదని.. ఆకాష్ జగన్నాథ్ అని అనౌన్స్ చేశాడు. అయితే తన పేరు మార్చుకోవడం వెనక ఉన్న కారణం చెప్పలేదు ఆకాష్. ఈ మేరకు ఆకాష్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. ఇన్‌స్టాలో పోస్ట్‌ లో తన పేరు మార్చుకుంటున్నట్టు అనౌన్స్ చేశాడు ఆకాష్. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన పేరు మార్చుకున్నాడు. మదర్స్ డే సందర్భంగా తన పేరును తన తల్లి పేరును కలుపుతూ.. సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నారు. ఇప్పుడు ఆకాష్ కూడా తన పేరును తన తండ్రి పేరును కలిసి ఇలా ఆకాష్ జగన్నాథ్ గా మార్చుకున్నాడు.

Also Read : Jr NTR : దేవరకు కాస్త బ్రేక్ ఇచ్చి వార్ 2 షూటింగ్ చేస్తున్న తారక్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com