Ajith Kumar: కేవలం నటుడిగా మాత్రమే కాదు, ప్రొఫెషనల్ రేసర్ గానూ అజిత్ కు మంచి గుర్తింపు ఉంది. షూటింగ్స్ లేకపోతే రేసింగ్ బైక్స్, కార్లలో చక్కర్లు కొడుతుంటారు. తాజాగా తన రేసింగ్ టీమ్‌ను ప్రకటించారు. ‘అజిత్ కుమార్(Ajith Kumar) రేసింగ్’ పేరుతో టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు అజిత్ మేనేజర్ సురేశ్ చంద్ర వెల్లడించారు. ఈ సందర్భంగా దుబాయ్ ఆటోడ్రోమ్‌లో ఫెరారీ 488ఈవీఓను అజిత్ టెస్ట్ డ్రైవ్ చేసిన ఫొటోలను పంచుకున్నారు. ఈ రేసింగ్ టీమ్ వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ఈ టీమ్‌కు ఫాబియన్ డిఫియక్స్ అఫిషియల్ డ్రైవర్‌గా వ్యవహరించనున్నారు. ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని తెలిపారు. అదే సమయంలో రేసింగ్ ప్రోగ్రామ్‌కు కూడా మద్దతు తెలుపుతున్నామన్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు పంచుకోనున్నట్లు వివరించారు.
Ajith Kumar – 13ఏళ్ల తర్వాత మోటార్ రేసింగ్‌లోకి అజిత్ !
వచ్చే ఏడాది జరగనున్న యూరోపియన్ జీటీ4 ఛాంపియన్‌షిప్‌లో అజిత్ టీమ్ పాల్గొంటుందని ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్సీఐ) ప్రకటించింది. 13ఏళ్ల తర్వాత అజిత్ మళ్లీ మోటార్ రేసింగ్‌లోకి రావడం సంతోషంగా ఉందని ఎఫ్ఎంఎస్సీఐ అధ్యక్షుడు అక్బర్ ఇబ్రహీం అన్నారు. మరోవైపు ఔత్సాహికులైన మహిళల కోసం వీనస్ మోటార్ సైకిల్స్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది. మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అజిత్ ఈ స్టార్టప్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అజిత్ తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’లో నటిస్తున్నారు. మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇది కాకుండా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ద్విభాష చిత్రంలోనూ నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా ఇది విడుదల కానుంది.
Also Read : Manchu Mohan Babu: సీఎం చంద్రబాబుతో మంచు మోహన్ బాబు మీటింగ్ ! మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ !