Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో, కేజీఎఫ్, సలార్ ఫేం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక సినిమా ప్లాన్ చేసినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ‘కె.జి.ఎఫ్’ కథకు కనెక్ట్ అయ్యేలా మరో స్టోరీని ప్రశాంత్ రెడీ చేశాడాని, అందులో అజిత్(Ajith Kumar) హీరోగా నటించనున్నారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకున్న అజిత్… కేజీఎఫ్, సలార్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి మార్కెట్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనేసరికి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీనితో వీరిద్దరి కాంబినేషన్ గురించి అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అజిత్, ప్రశాంత్ నీల్ సినిమా గురించి అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర క్లారిటీ ఇచ్చారు.
Ajith Kumar Movie Updates
ఈ విషయం గురించి తాజాగా అజిత్(Ajith Kumar) మేనేజర్ సురేష్ చంద్ర మాట్లాడుతూ… ఈ వాదనలను ఇలా ఖండించారు. అదంతా ప్రచారం మాత్రమేనని చెప్పుకొచ్చారు. ‘ఈ పుకార్లు ఆన్‌లైన్‌లో వచ్చాయి. ఇందులో ఎలాంటి నిజం లేదు. అజిత్, ప్రశాంత్ నీల్ కలిశారనేది మాత్రం నిజమే… కానీ, వారు ఒకరినొకరు మర్యాదపూర్వకంగా మాత్రమే కలుసుకున్నారు. ఒకరిపై మరొకరు అత్యున్నత గౌరవం కలిగి ఉంటారు. అయితే, వారు కలిసినప్పుడు ఏ సినిమా గురించి చర్చించలేదు. ప్రశాంత్ డైరెక్షన్ లో అజిత్ సినిమా వస్తే చూడటానికి నేనూ ఇష్టపడతాను. కానీ, భవిష్యత్తులో అయినా వీరి కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్ వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు అని సురేష్ చంద్ర తెలిపారు.
ప్రస్తుతం అజిత్ మగిళ్ తిరుమేని దర్శకత్వంలో విడాముయర్చి సినిమాలో నటించారు. కొద్దిరోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకునన ఈ సినిమా దీపావళికి ఈ సినిమా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. దీని తరువాత అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో అజిత్ తరువాతి సినిమా ఉంటుంది. ఇదిలా ఉంటే, ప్రశాంత్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. దాని తరువాత ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ సలార్ కు సీక్వెల్ గా సలార్ 2 సినిమాను తెరకెక్కించనున్నారు.
Also Read : Renu Desai: మంత్రి కొండా సురేఖతో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ భేటీ !