KGF 3 : భారత దేశంలో అత్యంత జనాదరణ పొందిన దర్శకులలో శాండిల్ వుడ్ కు చెందిన ప్రశాంత్ నీల్. టేకింగ్, మేకింగ్ లో తనదైన ముద్ర కనబర్చాడు. తీసింది కొన్ని సినిమాలే అయినా ఊహించని రీతిలో స్టార్ డమ్ స్వంతం చేసుకున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ తీస్తున్నాడు. షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరో వైపు కన్నడ సూపర్ స్టార్ యశ్ తో తాను తీసిన కేజీఎఫ్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. రికార్డులను బద్దలు కొట్టింది.
KGF 3 – Kollywood Hero
అప్పటి దాకా ఉన్న మూస ధోరణిని ప్రశాంత్ నీల్ బ్రేక్ చేశాడు. ఆ ఒక్క సినిమా తనను ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకునేలా చేశాడు. అది బ్లాక్ బస్టర్ కావడంతో కేజీఎఫ్ 2 తీశాడు. అది కూడా కాసుల వర్షం కురిపించింది. నిర్మాతలకు పంట పండేలా చేసింది. అద్భుతమైన నటన, సహజత్వానికి దగ్గరగా ఉండే కథ. అంతకు మించిన కథనం ఉండడంతో ప్రశాంత్ నీల్ వైరల్ గా మారాడు.
ఇదే సమయంలో డార్లింగ్ ప్రభాస్ తో సలార్ తీశాడు. అది కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రేక్షకులను సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది. మరో వైపు కేజీఎఫ్ మూవీతో యశ్(Yash) ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారి పోయాడు. తను ప్రస్తుతం టాక్సిక్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఇందులో కియారా అద్వానీతో పాటు నయనతార నటిస్తోంది. తాజాగా యశ్ , ప్రశాంత్ నీల్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ మరోసారి తెర మీదకు రానుందని సమాచారం.
ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ చిత్రానికి సంబంధించి సీక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో యశ్ తో పాటు తమిళ సినీ రంగానికి చెందిన స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) ను ఎంపిక చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే తనకు ఏ పాత్ర ఇచ్చినా అది 100 శాతం న్యాయం చేకూరుస్తాడు. ఇద్దరు స్టార్ హీరోలతో తీయబోయే కేజీఎఫ్ సీక్వెల్ మరెలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే తను నటిస్తున్నాడా లేదా అనేది మూవీ మేకర్స్ ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు.
Also Read : Hero Allu Arjun Meet :పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని పరామర్శించిన బన్నీ