Ajith Kumar: లగ్జరీ ఫెరారీ కారు కొన్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ !

లగ్జరీ ఫెరారీ కారు కొన్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ !

Hello Telugu - Ajith Kumar

Ajith Kumar: తెలుగు, తమిళ బాషల్లో పరిచయం అక్కర్లేని స్టార్ హీరో అజిత్ కుమార్. వాలి, ప్రేమలేఖ వంటి సినిమాలతో రెండు దశాబ్దాల క్రితం తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ కోలీవుడ్ స్టార్ హీరో… ఇటీవల విశ్వాసం, వివేకం, తెగింపు వంటి డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లోను మంచి మార్కెట్ ను సంపాదించుకున్నారు. స్వతహాగా రేసర్ అయిన అజిత్ కు రేస్ కార్లు,రేస్ బైక్ లు అంటే చాలా ఇష్టం. తన బైక్ పై అప్పుడప్పుడూ ఇండియాను చుట్టుముడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త స్పోర్ట్స్ బైక్స్, కార్స్‌ ని ఎప్పటికప్పుడు కొనేస్తుంటాడు. తాజాగా అలానే అత్యంత ఖరీదైన సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కారుని సొంతం చేసుకున్నాడు.

Ajith Kumar New Car

ప్రస్తుతం ‘విడామయూర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలతో బిజీగా ఉన్న ఈ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith Kumar)… సినిమాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు దాదాపు రూ.9 కోట్ల విలువ చేసే ఎరుపు రంగు ఫెర్రరీ ఎస్ఎఫ్ 90 కారుని కొనుగోలు చేశాడు. ఈ ఫెరారీ కారుతో అజిత్ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది. ఈ ఫెర్రారీ కారు ప్రత్యేకత ఏంటంటే… ఇది హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్. దీనితో పాటు అజిత్ కారు కలెక్షన్స్‌లో బీఎండబ్ల్యూ 740ఎల్ఐ, ఫెర్రారీ 458 ఇటాలియా, కవసాకీ నింజా జెడ్ ఎక్స్ 14ఆర్, బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, హోండా ఎకార్డ్ తదితర వెహికల్స్ ఉన్నాయి. వీటితో పాటు పలు స్పోర్ట్స్ బైక్స్ కూడా ఉన్నాయి.

Also Read : Nandamuri Kalyan Ram: రూ.8 కోట్ల ఖర్చు, వెయ్యిమంది ఫైటర్స్ లో కళ్యాణ్ రామ్ క్లైమాక్స్‌ ఫైట్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com